ETV Bharat / crime

స్కూల్​కు వెళ్లమని తండ్రి మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య.. ఎక్కడంటే?

author img

By

Published : Feb 7, 2023, 3:05 PM IST

School student suicide: తన కుమారుడు బాాగా చదివి ఏ డాక్టరో, ఇంజినీరో, పోలీసు ఆఫీసర్​ అవుతాడని ఓ తండ్రి ఆశపడ్డాడు. ఆ క్రమంలోనే కూలీ పనులు చేసుకుంటూ అల్లారుముద్దుగా పిల్లలను పెంచుకొని బాగా చదివిస్తున్నాడు. కానీ పిల్లాడు స్కూల్​కు వెళ్లనని మారం వేయడంతో కాస్త అసహనానికిలోనైనా తండ్రి.. అబ్బాయిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలంలో చోటుచేసుకుంది.

School student suicide
School student suicide

School student suicide: స్కూల్​కు వెళ్లమని కుమారుడ్ని.. తండ్రి మందలించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఎదురబోయిన వీరమల్లు, రేణుక దంపతులు వ్యవసాయ కూలీలు. కూలీ పనులు చేసుకుంటూ కుమారుడు రవి చరణ్, కుమార్తై రవళిని చదివిస్తున్నారు. కుమారుడు రవిచరణ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా.. కుమార్తె రవళి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఈ క్రమంలోనే ఇవాళ కుమారుడు స్కూల్​కు వెళ్లడానికి నిరాకరించడంతో తండ్రి.. రవిచరణ్​ను మందలించి పొలం పని నిమిత్తం వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన పిల్లాడు ఇంటి వద్ద ఎవరు లేని సమయం చూసి చీరతో ఉరివేసుకొని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటికే అక్క గమనించి తమ్ముడు విగత జీవిగా వేళాడటాన్ని చూసి చలించిపోయింది.

బోరున విలపిస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది. చుట్టుపక్కల వారి సహాయంతో రవిచరణ్​ను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. కుమారుడు మరణవార్త విన్న తండ్రి వీరమల్లు బోరున విలపించాడు. కుమారుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అతని కన్నీటిని ఆపడం ఎవరి వల్ల కాలేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.