ETV Bharat / crime

Weapons seized: స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో అక్రమ ఆయుధాలు.. సీజ్ చేసిన పోలీసులు

author img

By

Published : Dec 21, 2021, 11:34 AM IST

Updated : Dec 21, 2021, 12:06 PM IST

అక్రమ ఆయుధాలు
అక్రమ ఆయుధాలు

11:32 December 21

స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో అక్రమ ఆయుధాలు

Weapons seized: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో ఎస్​వోటీ పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. గగన్‌పహాడ్‌లోని హైమద్ ఇంట్లో ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేసి... రెండు తుపాకులు, 30 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

హైమద్‌ను విమానాశ్రయ పోలీసులకు ఎస్‌వోటీ సిబ్బంది అప్పగించారు. పలు పోలీస్‌స్టేషన్లలో హైమద్‌పై 17 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో హైమద్‌పై 17 కేసులు నమోదవగా... గతంలోనూ పీడీ చట్టం కింద జైలుకు వెళ్లొచ్చినట్లుగా గుర్తించారు.

ఇదీ చూడండి: ప్రాణం తీసిన కబడ్డీ.. తలకు బలమైన గాయమై ఇంటర్ విద్యార్థి మృతి

Last Updated : Dec 21, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.