ETV Bharat / crime

తల్లితో గొడవ.. గ్యాస్​ లీక్​ చేసుకుని.. ఆపై చేయి కోసుకుని..!

author img

By

Published : Jul 7, 2022, 2:58 PM IST

Fire accident: తల్లితో జరిగిన గొడవ కారణంగా ఇంటినే తగలబెట్టాలనుకున్నాడో కుమారుడు. అది కూడా ఇంట్లో ఉండి మరీ.. గ్యాస్​ లీక్​ చేసుకుని నిప్పంటించుకున్నాడు. సమయానికి ఫైర్​ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేస్తే.. వాళ్లకు భయపడి చేయి కోసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా గాజులరామారంలో జరిగింది.

software-employee-attempted-to-burn-his-house-with-gas-leakage-and-suicide
software-employee-attempted-to-burn-his-house-with-gas-leakage-and-suicide


Fire accident: కుటుంబ కలహాల కారణంగా గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పంటించి.. తాను బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా గాజులరామారంలో జరిగింది. దేవేంద్రనగర్​కు చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నాడు. శ్రవర్​కు గీతతో పెళ్లి కాగా.. వారికి ఇద్దరు కుమారులున్నారు. అయితే శ్రవణ్ కుమార్​కు అతడి తల్లికి మధ్య తరచూ.. ఆస్తి గొడవలు జరుగుతుండేవి. గొడవల కారణంగా.. కొద్ది నెలల క్రితం శ్రవణ్​.. ఇంటిని వదిలి మరో ప్రాంతంలో కిరాయికి ఉంటున్నారు. ఉద్యోగం కూడా మానేశాడు.

ఈరోజు తల్లి వద్దకు వచ్చిన శ్రవణ్.. తల్లిని కొంత నగదు ఇవ్వమని అడిగినట్లు సమాచారం. ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైన శ్రవణ్​.. తల్లిని బయటకు పంపి ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి ప్రధాన ద్వారం కూడా తాళం వేసుకున్నాడు. ఇంట్లో ఉన్న మూడు సిలిండర్ల గ్యాస్ లీక్ చేసి.. నిప్పంటించాడు. ఒక్కసారిగా పేలుడు శబ్దం విన్న చుట్టుపక్కల స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరిన అగ్నిమాపక సిబ్బంది.. జేసీబీ సాయంతో మొదటి అంతస్తులో ఉండే కిటికీలు ధ్వంసం చేసి మంటలను అదుపు చేశారు.

ఫైర్ సిబ్బందిని చూసి భయపడిన శ్రవణ్​..​ బ్లేడుతో చేయి కోసుకుని బాత్రూమ్​లో పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం లీకవుతున్న గ్యాస్ సిలిండర్లను అదుపుచేయటంతో.. పెద్దప్రమాదమే తప్పింది. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.