ETV Bharat / crime

Rowdy Sheeter: సోదరుడు చనిపోయాడని.. కత్తి పట్టుకుని బయల్దేరిన రౌడీషీటర్

author img

By

Published : Feb 10, 2022, 9:51 AM IST

Rowdy Sheeter Hulchul: సోదరుడి మృతితో అతని స్నేహితులపై కక్ష్య పెంచుకున్నాడు ఓ రౌడీషీటర్‌. రాత్రి సోదరుడి స్నేహితులు తారసపడటంతో వారిని వెంబడించాడు. ఈ క్రమంలో వేగంగా బండి నడిపి వాహనదారులను ఢీకొట్టాడు. దీంతో వాహనదారులు, పోలీసులు రౌడీషీటర్​ వెంటపడగా.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దగ్గర్లోని ఆస్పత్రిలో దూరి.. ఐసీయూలో ఉన్న రోగి మెడపై కత్తిపెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. తర్వాత ఏమైదంటే..!

Rowdy Sheeter Hulchul
Rowdy Sheeter Hulchul

Hyderabad Rowdy Sheeter: హైదరాబాద్‌ టోలీచౌకిలో కత్తితో ఓ రౌడీషీటర్ హల్‌చల్ చేశాడు. సోదరుడి మృతితో అతని స్నేహితులపై కక్ష పెంచుకున్న రౌడీషీటర్‌ ఖాజా ఫరీదుద్దీన్‌... రాత్రి వారు తారసపడటంతో వెంబడించాడు. బంజారాహిల్స్‌లో వేగంగా బండి నడిపి వాహనదారులను ఢీకొట్టాడు. వాహనదారులు వెంబడించడంతో టోలీచౌకి వైపు పరారయ్యాడు.

టోలీచౌకిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు పోలీసుల యత్నించగా.. పారిపోయాడు. రౌడీషీటర్‌ను పోలీసులు, స్థానికులు వెంబడించగా... ఓ ప్రైవేటు ఆస్పత్రిలోకి దూరాడు. ఐసీయూలో రోగి మెడపై కత్తిపెట్టి తప్పించుకునేందుకు యత్నించాడు. చాకచక్యంగా రౌడీషీటర్‌ ఖాజా పరీదుద్దీన్‌ను పోలీసులు పట్టుకున్నారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఖాజా ఫరీదుద్దీన్‌పై కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

కత్తితో రౌడీషీటర్ హల్‌చల్

ఇదీ చూడండి: Job notifications: ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ.. !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.