ETV Bharat / crime

Rape on minor girl: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం... పెళ్లి పేరుతో అత్యాచారం

author img

By

Published : Mar 7, 2022, 10:25 AM IST

Rape on minor girl: తెలిసీ తెలియని వయసు.. ఎదిగీ ఎదగని మనసు.. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఇంటర్నెట్‌.. కొత్తకొత్త వ్యక్తుల్ని, సరికొత్త కోరికలను పరిచయం చేసే సోషల్‌ మీడియా! ఇలాంటి మాయా ప్రపంచంలో చిక్కి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమలో పడింది ఓ బాలిక. పెళ్లి చేసుకుంటానని చెబితే నమ్మింది. ఇంకేం తన గదికి తీసుకెళ్లి .. మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Rape on minor girl
మైనర్‌ బాలికపై అత్యాచారం

Rape on minor girl: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాలికను పరిచయం చేసుకున్నాడు. ప్రేమించానని నమ్మించాడు. అది నిజమేనని... తెలిసీతెలియని వయసులో నమ్మింది ఆ బాలిక. ఇంకేం తన రూముకు తీసుకెళ్లి... మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నమ్మించి...గదికి తీసుకెళ్లి..

యూసుఫ్‌గూడ ప్రాంతంలో నివాసముంటున్న సాయిరాం అనే 19ఏళ్ల విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడని.. ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి... తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:కూతురు ప్రేమ వివాహం.. పురుగుల మందు తాగిన తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.