ETV Bharat / crime

Cyber Crime: కోట్లు కొల్లగొట్టేందుకు నగరానికి వచ్చారు... అరెస్టయ్యారు

author img

By

Published : Dec 25, 2021, 9:33 AM IST

Cyber Crime: హైదరాబాద్‌ కేంద్రంగా ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు యత్నించిన నేపాలీలను రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు దీపుమండల్‌ కోసం గాలిస్తున్నట్లు సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. దీపుమండల్‌కు చైనాతో నేరుగా లింకులు ఉన్నట్లు వెల్లడించారు. చైనాలో ఇతనితో సంబంధాలున్న వ్యక్తులు ఎవరు? ఇతన్ని నడిపిస్తుంది ఎవరు? అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు.

Cyber Crime
Cyber Crime

Cyber Crime: హైదరాబాద్‌ కేంద్రంగా ఆర్థిక మోసాలకు తెరలేపడానికి యత్నించిన ముగ్గురు నేపాలీలను రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. నేపాల్‌కు చెందిన గోపాల్‌షెర్పా(24), సుశీల్‌గురుంగ్‌(29), నిమతమంగ్‌ అలియాస్‌ అమ్రిత్‌తమంగ్‌(24)లు రెండు నెలల క్రితం పశ్చిమబంగాలో సిలిగురి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని మరో ముగ్గురు బెంగాలీలతో కలిసి కాల్‌ సెంటర్‌ నిర్వహించారు. డబ్బులు పెట్టుబడి పెడితే రెండింతలు వస్తాయని జనాన్ని నమ్మించారు. పెట్టుబడి పెట్టినవారికి డబ్బు తిరిగి చెల్లించక మోసాలకు పాల్పడ్డారు. ఆ డబ్బును ప్రధాన నిందితుడు దీపుమండల్‌ ద్వారా చైనాకు తరలించారు. ఘట్కేసర్‌కు చెందిన వ్యాపారి బానోతు కిరణ్‌కుమార్‌ రూ.86లక్షలు వారి ఖాతాకు బదిలీ చేసి మోసపోయాడు. అతను ఈ ఏడాది అక్టోబరు 22న సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు నవంబరు 3న పోలీసులకు బెంగాల్‌కు వెళ్లి ముఠాలోని నూర్‌ఆలం, ఎక్‌రాంహుసేన్‌, ఎండీ ఇజారుల్‌ను అరెస్టుచేసి వారి ఖాతాలో ఉన్న రూ.15లక్షలు బదిలీ కాకుండా కట్టడి చేశారు. ప్రధాన నిందితుడు దీపుమండల్‌తో పాటు గోపాల్‌షెర్పా, సుశీల్‌గురుంగ్‌, నిమతమంగ్‌ తప్పించుకున్నారు.

రైలు దిగారు.. అరెస్టయ్యారు..

పది రోజుల క్రితం సైబర్‌ క్రైం పోలీసుల బృందం సదరు నలుగురు నిందితుల కోసం బెంగాల్‌కు వెళ్లారు. అక్కడ వారికి కీలక సమాచారం లభించింది. దీపక్‌మండల్‌ ఆదేశాలతో ముగ్గురు నిందితులు హైదరాబాద్‌కు బయలు దేరినట్లు తెలిసింది. వారు హైదరాబాద్‌లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఆర్థిక మోసాలకు పాల్పడాలని ప్రణాళిక వేశారు. ఇది తెలుసుకున్న పోలీసులు ముగ్గురి చరవాణుల నెంబర్లు సాధించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వారు గురువారం రాత్రి రైలు దిగగానే అరెస్టు చేశారు. వారి నుంచి 53 చరవాణులు, 215 సిమ్‌కార్డులు, ఒకలక్ష నగదు, ఒక ల్యాప్‌టాప్‌, దీపుమండల్‌ ఒరిజినల్‌ పాస్‌ఫోర్టు, 8బ్యాంకు చెక్కులు, 12 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కిన ముగ్గురు నేపాలీ నిందితులు భారత్‌లోకి అక్రమంగా వచ్చారు. వీరిని నేపాల్‌కు చెందిన కలా అనే వ్యక్తి నదీ జాలాల ద్వారా అక్రమంగా తీసుకువచ్చాడు. కేసులో ప్రధాన నిందితుడు దీపుమండల్‌కు చైనాతో నేరుగా లింకులు ఉన్నట్లు సీపీ వెల్లడించారు. బ్యాంకు ఖాతాలో జమైన డబ్బులు క్రిప్టోకరెన్సీ ద్వారా మార్చి చైనాకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. చైనాలో ఇతనితో సంబంధాలున్న వ్యక్తులు ఎవరు? ఇతన్ని నడిపిస్తుంది ఎవరు? అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: Cyber Cheaters: మాటల మాయగాళ్లు.. నమ్మించి ముంచేస్తున్నారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.