ETV Bharat / crime

కుటుంబ కలహాలతో మెట్రోస్టేషన్​ నుంచి దూకి ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

author img

By

Published : Feb 13, 2022, 4:16 PM IST

Private Employee Suicide: హైదరాబాద్​ బేగంపేట్​లోని ప్రకాశ్​​నగర్ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

Private employee commits suicide by jumping from metro station with family disputes
Private employee commits suicide by jumping from metro station with family disputes

Private Employee Suicide: కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్​ బేగంపేట్​లోని ప్రకాశ్​​నగర్ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్​కు చెందిన రాజు.. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం(ఫిబ్రవరి 12న) రాత్రి సమయంలో ప్రకాశ్​​నగర్ చేరుకున్న రాజు.. మెట్రోస్టేషన్​పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన రాజును స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు(ఫిబ్రవరి 13) ఉదయం రాజు మృతి చెందాడు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రాజు ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాజు ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.