ETV Bharat / crime

Mahesh Bank Server Hacking Case: సవాల్​గా మారిన మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌ హ్యాకింగ్‌

author img

By

Published : Jan 27, 2022, 2:27 PM IST

Mahesh Bank Server Hacking Case: ఏపీ మహేశ్​కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసిన కేసులో చిక్కుముడి వీడలేదు. ఇప్పటి వరకు ఆధారాలు లభించకపోవడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ హ్యాకింగ్‌ కేసు సవాలుగా మారింది. సైబర్ నేరగాళ్లు హ్యాక్‌ చేసిన మూడు ఖాతాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగానికి హ్యాకింగ్‌ వల్ల ముప్పు ఉండటంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా మహేశ్‌ బ్యాంక్‌ ఘటనపై దృష్టిసారించాయి.

Mahesh Bank Server Hacking Case
Mahesh Bank Server Hacking Case

Mahesh Bank Server Hacking Case: మహేశ్​ బ్యాంక్‌ సర్వర్ హ్యాకింగ్ కేసు పోలీసులకు సవాల్​గా మారింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులకు పూర్తి స్థాయిలో ఆధారాలు లభించడం లేదు. సైబర్ నేరగాళ్లు హ్యాక్‌ చేసిన ఖాతాలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మూడు ఖాతాలను హ్యాక్‌ చేసిన సైబర్ మోసగాళ్లు.. ఆ ఖాతాల నుంచి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని 20 బ్యాంకులకు చెందిన 128 ఖాతాలకు నగదు బదిలీ చేశారు.

Mahesh Bank Server Hacking Case Update: సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన ఖాతాలు ఎవరివనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మూడు ఖాతాలను సైబర్ నేరగాళ్లే తెరిచారా.. లేక ఇతరుల సాయం తీసుకుని ఖాతాలను తెరిపించారా అనే వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు తెలుసుకుంటున్నారు. మూడు ఖాతాలకు సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సదరు వ్యక్తులకు సైబర్ నేరగాళ్లకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగానికి ముప్పుగా పరిణమిస్తున్న హాకింగ్​పై కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా ఆరా తీస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.