ETV Bharat / crime

Camera in bathroom : అక్కడికి వెళుతున్నారా.. ఆ బాత్​రూమ్​లో కెమెరా ఉంది జాగ్రత్త!

author img

By

Published : Sep 23, 2021, 10:13 AM IST

Updated : Sep 23, 2021, 12:08 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో ఓ ఫుడ్​కోర్టులోని బాత్​రూమ్(Camera in bathroom)​లో కెమెరా ఆన్​చేసిన సెల్​ఫోన్ ఉండటం కలకలం రేపింది. స్నేహితులతో కలిసి రెస్టారెంట్​కు వెళ్లిన ఓ యువతి రెస్ట్​రూమ్​కు వెళ్లింది. అక్కడ కెమెరా ఆన్​చేసిన మొబైల్ ఉండటం గమనించి ఖంగుతిన్నది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళల బాత్​రూమ్​లో కెమెరా
మహిళల బాత్​రూమ్​లో కెమెరా

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులో దారుణం చోటు చేసుకుంది. మహిళల బాత్‌రూమ్‌(Camera in bathroom)లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరపడం కలకలం రేపింది. ఫుడ్​కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్​రూమ్​కు వెళ్లింది. అక్కడి బాత్‌రూమ్‌లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడు బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు. బాత్‌రూమ్‌ క్లీనర్‌ బెనర్జీ ఫోన్‌ కెమెరా అమర్చినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో ఇతరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. నిన్నంతా ఫోన్‌ కెమెరా ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Last Updated :Sep 23, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.