ETV Bharat / crime

ప్రేమిస్తున్నానంటూ వెంటపడి... పెళ్లికి ఒప్పుకోలేదని గొంతుకోశాడు

author img

By

Published : May 22, 2021, 7:52 AM IST

murder
murder

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నమ్మి మనసిచ్చింది. అన్నీ అతనే అనుకుంది. కానీ ఆమె వేరే అబ్బాయితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు ఆ అబ్బాయి. పథకం ప్రకారం ప్రియురాలుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బీరు సీసాతో తలపై కొట్టాడు. అనంతరం అదే సీసాతో గొంతు కోసి చంపాడు.

తెలిసీతెలియని వయసులో మరో ప్రేమకథ విషాదాంతమైంది. ప్రేమ పేరుతో వెంటపడిన ఓ యువకుడు పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో మద్యం మత్తులో బీరుసీసాతో ఒక యువతి తలపై కొట్టి, గొంతు కోసి చంపేసిన దారుణ ఘటన నాగార్జునసాగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వెలుగు చందన(18)కు అనుముల మండలం కొరివేనిగూడెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శంకర్‌ (19) అనే యువకుడితో కొద్దికాలంగా పరిచయం ఉంది. శుక్రవారం అతడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లింది. వీరు నాగార్జునసాగర్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో శంకర్‌ బాగా మద్యం తాగాడు. ఈ క్రమంలో పెళ్లి విషయమై వాదనలు జరిగాయి. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతున్నావని అనుమానం వ్యక్తం చేస్తూ ఆవేశానికి గురైన శంకర్‌.. బీరుసీసాతో చందన తలపై బలంగా కొట్టాడు. పగిలిన సీసాతో గొంతుకోయడంతో తీవ్ర రక్తస్రావమై చందన అక్కడికక్కడే మరణించింది. అనంతరం నిందితుడు హాలియా పోలీసులకు లొంగిపోయాడు. హత్య జరిగిన ప్రాంతం సాగర్‌ పరిధిలోకి వస్తుందని వారు నిందితుడిని సాగర్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. వారు నిందితుడిని వెంటబెట్టుకొని హత్య జరిగిన ప్రదేశానికి బయలుదేరారు. కాని బాగా మద్యం మత్తులో ఉన్న కారణంగా ఎక్కడో సరిగా చెప్పలేకపోవడంతో రాత్రి 7 గంటల వరకూ పోలీసులు గాలించి చివరకు మృతదేహాన్ని గుర్తించారు.

ఎటూ వెళ్లొద్దని చెప్పా: తల్లి

బొల్లారానికి చెందిన వెలుగు రాములమ్మకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె వివాహం జరగగా, మిగతా ఇద్దరు కుమార్తెలు ఇంటివద్దే ఉంటున్నారు. మూడో కుమార్తె చందన గతేడాది ఇంటర్మీడియట్‌ చదివింది. తన క్లాస్‌మేట్‌కు స్నేహితుడైన శంకర్‌తో చందనకు పరిచయమైంది. కరోనా బాగా ఉందని ఎక్కడికి వెళ్లవద్దని చెప్పి తాను ఉపాధి పనికి వెళ్లగా తన కూతురుకు మాయమాటలు చెప్పి శంకర్‌ తీసుకెళ్లి చంపేశాడని చందన తల్లి రాములమ్మ బోరున విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.