ETV Bharat / crime

Gang Rape news: మద్యం తాగించి.. ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారయత్నం

author img

By

Published : Sep 29, 2021, 8:46 AM IST

Updated : Sep 29, 2021, 12:19 PM IST

gang rape on a girl in nizamabad
gang rape on a girl in nizamabad

08:43 September 29

యువతిపై సామూహిక అత్యాచారయత్నం

కామాంధుల పైశాచికత్వానికి ఎంతో మంది మహిళలు (rape victims news) బలవుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే రక్షణనివ్వాల్సింది పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి... వారి పశువాంఛను తీర్చుకునేందుకు యత్నిస్తున్నారు. చిన్నారులు, బాలికలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుస అత్యాచార ఘటనలు (rape incidents) మానవ మృగాల ఆకృత్యాలకు అదుపు లేకుండా పోవడాన్ని చాటుతున్నాయి. తాజాగా ఓ ఆసుపత్రి గదిలో యువతిపై సామూహిక అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్​లో యువతిపై నలుగురు అత్యాచారయత్నానికి (gang rape attempt in nizamabad) పాల్పడ్డారు. యువతికి బలవంతంగా మద్యం తాగించి... ఈ దారుణానికి యత్నించారు. ఓ ఆసుపత్రి గదిలోకి తీసుకెళ్లి  సాముహిక అత్యాచారయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం...  సఖీ సెంటర్​కు  తరలించారు. ఘటనపై అదనపు సీపీ ఉషా విశ్వనాథ్ వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం... పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలని మహిళా కమిషన్​ సభ్యురాలు సుదాం లక్ష్మీ పరామర్శించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత లేకపోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. 

ఇదీ చూడండి: కుమార్తెనే గర్భవతిని చేసిన తండ్రి.. అబార్షన్​కు ఒప్పుకోలేదని...

Last Updated :Sep 29, 2021, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.