ETV Bharat / crime

లైవ్​ వీడియో : ధాన్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

author img

By

Published : Apr 20, 2021, 4:57 PM IST

fire in lorry, fire in lorry in kamareddy
లారీలో మంటలు, పోల్కంపేట్​లో లారీలో చెలరేగిన మంటలు

కామారెడ్డి జిల్లా పోల్కంపేట్‌ గేట్‌ వద్ద లారీలో అగ్ని ప్రమాదం జరిగింది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ధాన్యం పూర్తిగా దగ్ధమైంది.

కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం పోల్కంపేట్‌ గేట్‌ వద్ద ఓ లారీ దగ్ధం అయ్యింది. లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనం నుంచి దిగిపోయాడు. మంటల్లో లారీ పూర్తిగా కాలిపోయింది.

ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాసేపు ట్రాఫిక్​కి అంతరాయం కలిగింది.

లారీలో మంటలు, పోల్కంపేట్​లో లారీలో చెలరేగిన మంటలు

ఇదీ చదవండి: ద్విచక్ర వాహనం చోరీ... సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.