ETV Bharat / crime

సంబురాల్లో సడేమియా... ఆఫర్ల పేరిట ఆన్‌లైన్‌లో నాసిరకం వస్తువులు

author img

By

Published : Oct 17, 2022, 11:27 AM IST

Inferior Goods In Online Offers: ఆఫర్లు ఇస్తున్నారు కదా అని ఆన్‌లైన్‌ షాపింగ్‌ని గుడ్డిగా నమ్మేస్తే మోసపోయే ప్రమాదం ఉంది. ఇదే అదునుగా కొన్ని సంస్థలు నకిలీ వస్తువులను వినియోగదారులకు అంటగడుతున్నాయి. అప్రమత్తత లేకపోతే జేబుకు చిల్లుపడే అవకాశం ఉంది. ఇ-కామర్స్‌ కంపెనీలు తమ ఫ్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఉత్పత్తులు నకిలీవి కావని ముందే నిర్ధారించుకోవడం కోసం సేఫ్‌గార్డ్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

online offers
online offers

Inferior Goods In Online Offers: పండగలు వస్తే ఆన్‌లైన్‌లో ఆఫర్లకు కొదువే ఉండదు. ఆఫర్లు ఇస్తున్నారు కదా అని ఆన్‌లైన్‌ షాపింగ్‌ని గుడ్డిగా నమ్మేస్తే మోసపోయే ప్రమాదం ఉంది. ఇదే అదునుగా కొన్ని సంస్థలు నకిలీ వస్తువులను వినియోగదారులకు అంటగడుతున్నాయి. అప్రమత్తత లేకపోతే జేబులకు చిల్లుపడే అవకాశం ఉంది. ఐఎస్‌ఐ మార్కులేని వస్తువుల విక్రయాలు ఏక్కువయ్యాయి. ఇటీవలే ఐఎస్‌ఐ మార్కు లేని నాసిరకమైన ప్రెజర్‌ కుక్కర్లను విక్రయానికి అనుమతి ఇచ్చినందుకు సీసీపీఏ(సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ) ప్రముఖ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. గ్రేటర్‌ పరిధిలో వచ్చే కేసుల్లో ఎక్కువశాతం ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణ నాసిరకం వస్తువులకు సంబంధించినవే.

కేసుల్లో 20 శాతం ఇవే ఇ-కామర్స్‌ నిబంధనలను ఆయా సంస్థలు గాలికొదిలేస్తున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి వినియోగదారుల కమిషన్లకు సైతం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తు, సేవలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి.2020 ఇ-కామర్స్‌ మార్గదర్శకాల ప్రకారం వస్తు, సేవలు, నాణ్యత, వస్తువు ఫీచర్స్‌ వంటి వివరాలను ఇ-కామర్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.

దీంతో పాటు బిజినెస్‌ పేరు, రిజిస్టర్‌ అయిన సంస్థనా లేక సాధారణమైనదా, జియోగ్రాఫిక్‌ చిరునామా, ఏమైనా శాఖలు(బ్రాంచెస్‌) ఉన్నాయా?, ప్రధాన కార్యాలయాలు, వెబ్‌సైట్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌, రేటింగ్‌, ఫీడ్‌బ్యాక్‌.. కొనుగోలు సమయంలోనే కొనాలా? వద్దా? అని నిర్ణయించుకునేందుకు వీలుగా అన్ని వివరాలను ప్రదర్శించాలి.ఇ-కామర్స్‌ కంపెనీలు తమ ఫ్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఉత్పత్తులు నకిలీవి కావని ముందే నిర్ధారించుకోవడం కోసం సేఫ్‌గార్డ్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆన్‌లైన్‌లో నకిలీ ఉత్పత్తిని అమ్మితే అది ఆన్‌లైన్‌ కంపెనీతో పాటు అమ్మకందారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.