ETV Bharat / crime

ఫోన్​లో మాట్లాడుతున్న కూతురు.. అనుమానంతో మేడ పైనుంచి తోసేసిన తండ్రి

author img

By

Published : Feb 10, 2023, 5:38 PM IST

Father Throws her Daughter from the Terrace: అనుమానం.. ప్రశాంతంగా ఉన్న జీవితాలను తలకిందులు చేసింది. ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఇంటి మేడ మీద ఫోన్​లో మాట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతుందో కూడా తెలియదు. కానీ అనుమానంతో.. తండ్రి కుమార్తెను మేడ పైనుంచి కిందకి తోసేశాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో జరిగింది.

female
అమ్మాయి

Father Throws her Daughter from the Terrace: ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోని ఉదయపూర్ ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సెల్​ఫోన్ మాట్లాడుతున్న కుమార్తెను అనుమానంతో మేడ పైనుంచి కిందకి తోసేశాడు ఓ తండ్రి. దీంతో తీవ్ర గాయాలైన ఆ అమ్మాయి.. కోమాలోకి వెళ్లిపోయింది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలను వెల్లడించారు. ఉన్నవ గ్రామానికి చెందిన కూరాకుల కావ్య గణపవరం సీఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ నెల 8న ఇంటి మేడపై కావ్య సెల్ ఫోన్​లో మాట్లాడుతున్న సమయంలో గమనించిన తండ్రి వరప్రసాద్.. కుమార్తె ఎవరో యువకుడితో మాట్లాడుతుందని అనుమానించి మేడపై నుంచి కిందకు తోసేశాడు.

తీవ్ర గాయాలైన కావ్యను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కావ్య పరిస్థితి విషమంగా ఉంది. కోమాలోకి వెళ్లటంతో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వరప్రసాద్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.