ETV Bharat / crime

Btech student suicide: హాస్టల్​ గదిలో ఇంజినీరింగ్​ విద్యార్థిని ఆత్మహత్య..

author img

By

Published : Oct 26, 2022, 7:37 PM IST

Engineering student committed suicide: ఏమైందో తెలియదు.. చదువుకోవలసిన సమయంలో ఇలా విగత జీవిలా ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. ఎక్కడి నుంచో వచ్చి.. హైదరాబాద్​ సిటీలో ఇంజినీరింగ్​ విద్యను అభ్యసిస్తోంది. తమతో కలిసి సందడిగా కళాశాలకు వెళ్లి చదువుకోవలసిన తోటి స్నేహితురాలు ఇలా అవ్వడం చూసి మిగిలిన విద్యార్థినులు ఆవేదనను ఎవరు ఆపగలరు.. ఇంతకీ తను అంతలా నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అసలు.. ఇంతకీ ఈ దుర్ఘటన ఎక్కడ జరిగింది?

young girl suicide
యువతి ఆత్మహత్య

Student suicide with hanging: ఉరివేసుకొని ఇంజినీరింగ్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొంది. ఈ దుర్ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్​లో జరిగింది. ఇదే కళాశాలలో మూడో సంవత్సరం సీఎస్​ఈ చదువుతున్న శ్రావణి(20) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్​లోని తన గది పైన ఉండే ఖాళీ రూమ్​లోకి వెళ్లి ఫ్యాన్​కి ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఎంతకీ కిందకి రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా.. ఫ్యాన్​కు ఉన్న శ్రావణిని గమనించారు.

వెంటనే విద్యార్థినులు దగ్గరలోని పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. విద్యార్థినుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పేట్​ బషీరాబాద్​ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతిపట్ల విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మృతురాలు నిజామాబాద్​ పట్టణ వాసిగా గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.