ETV Bharat / crime

ED On Karvy Case updates : రెండో రోజు కార్వీ ఎండీ, సీఎఫ్‌వోను ప్రశ్నిస్తున్న ఈడీ

author img

By

Published : Jan 28, 2022, 12:09 PM IST

ED On Karvy Case updates: కార్వీ సంస్థ ఎండీ పార్థసారథి, సీఎఫ్‌వో కృష్ణహరిలను రెండో రోజు ఈడీ ప్రశ్నిస్తోంది. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా కార్వీ సంస్థల్లోని 14 డొల్ల కంపెనీల ద్వారా జరిపిన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్థసారథికి చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఈడీ అధికారులు జప్తు చేశారు.

ED On Karvy Case updates, karvy parthasarathi
రెండో రోజు కార్వీ ఎండీ, సీఎఫ్‌వోను ప్రశ్నిస్తున్న ఈడీ

ED On Karvy Case updates : కార్వీ సంస్థ ఎండీ పార్థసారథి, సీఎఫ్ఓ కృష్ణహరిలను ఈడీ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా... ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా సమాచారం. డొల్ల కంపెనీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టి... రూ.2,783కోట్లను పార్థసారథి తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కార్వీ గ్రూప్స్​లోని 14 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఆస్తులపై ఆరా..

Karvy Case parthasarathi : ఈ వ్యవహారంలో పార్థసారథితో పాటు కృష్ణహరి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పార్థసారథికి చెందిన రూ.700కోట్లు విలువ చేసే షేర్లను ఈడీ అధికారులు తాత్కాలిక జప్తు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో సొంత ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారనే వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఇదీ చదవండి: Karvy Scam: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ రూ.3520 కోట్ల మోసం

నాలుగు రోజుల కస్టడీ

Karvy Case: మనీలాండరింగ్ కేసులో కార్వీ ఎండీ పార్థసారథితో పాటు సీఎఫ్‌వో కృష్ణ హరిలను నాలుగు రోజుల కస్టడీలో భాగంగా విచారణకు తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మోసాలకు పాల్పడినట్లు హైదరాబాద్ సీసీఎస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. 2,873 కోట్ల రూపాయలు దారిమళ్లించారని.. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులో తనఖా పెట్టినట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. కార్వీపై పలు పోలీసు స్టేషన్లలోనూ కేసులున్నాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించి గ్రూపులోని పలువురు ఉద్యోగుల వాంగ్మూలం నమోదుచేసినట్లు చెప్పారు. ఇదీ చదవండి: Karvy scam: ‘కార్వీ’ కేసు దర్యాప్తులో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

వీరిద్దరి హస్తం

గతేడాది సెప్టెంబర్ 22న కార్వీకి చెందిన పలు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. నిధుల మళ్లింపులో పార్థసారథి, కృష్ణ హరి కీలకపాత్ర పోషించారని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 14 డొల్ల కంపెనీలకు మళ్లించారని ఆ తర్వాత వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని తెలిపారు. ఈ కేసులో పార్థసారథికి చెందిన రూ.700 కోట్ల విలువ చేసే షేర్లను సీజ్‌ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: Karvy Case: డొల్ల కంపెనీల్లో నిధులను ఎక్కడికి మళ్లించారు?

ప్రత్యేక న్యాయస్థానం అనుమతి

కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఎండీ పార్థసారథిని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం నాలుగు రోజుల కస్టడీకి ఇటీవలె అనుమతించింది. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈడీ అధికారులు పార్థసారథిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. పెట్టుబడిదారుల షేర్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టిన పార్థసారథి... ఆ నిధులను డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. డొల్ల కంపెనీల్లో ఖాతాల నుంచి నగదును మళ్లించి... ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్థసారథి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పలు బ్యాంకుల వివరాలు తెలుసుకోవడంతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: Karvy share: రూ.700 కోట్ల విలువైన కార్వీ షేర్లను స్తంభింపజేసిన ఈడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.