ETV Bharat / crime

అరకు నుంచి తెచ్చారు... హైదరాబాద్​లో అరెస్టు అయ్యారు...

author img

By

Published : May 20, 2022, 10:19 PM IST

Drugs Seized: అధికారులు ఎన్ని దాడులు చేసినా మాదకద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. హైదరాబాద్ లంగర్​హౌస్​ పీఎస్​ పరిధిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మాదకద్రవ్యాలు, కారు, 6 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Drugs Seized
Drugs Seized

Drugs Seized: హైదరాబాద్​లోని లంగర్​హౌస్​లో గుట్టు చప్పుడు కాకుండా మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురిని ఏడుగురిని సౌత్​ జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన 500 హాష్ ఆయిల్ బాటిల్స్, కారు, 6 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పట్టుబడిన నిందితులలో ఏ1 సంజీవ్​(28), ఏ2 మహేశ్​​(20)లు అరకు నుంచి మత్తుపదార్థాలు తీసుకొచ్చి లంగర్​హౌస్​లో ఉంటున్న ఏ3 రమేశ్​(27), ఏ4 ప్రేమ్​ కుమార్​(25)లకు విక్రయించేవారు. వాళ్లు నగరంలోని యువకులకు అమ్మేవారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న సౌత్​ జోన్​ టాస్క్ ఫోర్స్ అధికారులు, లంగర్​హౌస్​ పోలీసులు వారు డ్రగ్స్ అమ్ముతున్న ప్రాంతంపై దాడి చేశారు. విక్రయిస్తున్న నలుగురితో పాటు, ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఇంకెవరెవరు ఉన్నారనే దానిపై విచారణ చేపట్టారు. యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పిల్లలు ఎం చేస్తున్నారు, ఎక్కడకి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారనే విషయాలపై తల్లిదండ్రులు పూర్తి నిఘా ఉంచాలని కోరారు.

ఇవీ చదవండి:మహిళను అక్రమంగా నిర్బంధించారని జీఎస్టీ అధికారులపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.