ETV Bharat / crime

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పత్తి దగ్దం

author img

By

Published : Feb 6, 2023, 10:16 PM IST

Cotton burning on fire accident: ఆరుగాలం శ్రమించి తెల్లబంగారం పండించిన అన్నదాతకు విద్యుతీగల నుంచి నిప్పురవ్వల రూపంలో కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకుందామని నిల్వ చేసిన పత్తి దగ్దం కావడంతో రైతుల పరిస్థితి ఈనకాచి నక్కలపాలు చేసిన చందంగా మారింది.

ff
ff

Cotton burning on fire accident: సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్ మండలం చినిగేపల్లిలో నిల్వ చేసిన పత్తి కల్లాలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. గ్రామ పొలిమేరలో ముగ్గురు రైతులు పక్కపక్కన నిలువ చేసిన 450 క్వింటాళ్లలో 40 శాతానికి పైగా పత్తి కాలి బూడిద కావడంతో 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిలింది.

పత్తి కుప్పగా పోసిన కల్లాల మీదుగా విద్యుత్ తీగలు ఉండడంతో నిప్పురవ్వలు రాలిపడి అగ్ని ప్రమాదానికి కారణమైనట్లు రైతులు భావిస్తున్నారు. గ్రామస్తులు పరస్పరం సహకారంతో మంటలను అదుపు చేసేందుకు బిందెలు, పురుగుమందు స్పేర్లతో నీటిని పిచికారి చేయడంతో భారీ ఆస్తి నష్టం తప్పింది. జహీరాబాద్ నుంచి అగ్నిమాపక శకటం వచ్చినప్పటికీ చాలావరకు నష్టం వాటిల్లింది.

మంటలు అదుపు చేసిన పతికుప్పల్లో సగానికి పైగా పత్తి రంగు మారి మసక బారాడంతో రైతు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయామని కంటతడి పెట్టాయి. మంచి ధర లభిస్తుందని దాచుకున్న పత్తి పంట అగ్నికి ఆహుతి కావడంతో ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సహాయం అందజేయాలని బాధిత రైతు కుటుంబాలు కోరుతున్నాయి.

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పత్తి దగ్దం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.