ETV Bharat / crime

Suicide: శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

author img

By

Published : Sep 5, 2021, 8:01 PM IST

శంషాబాద్ ఎయిర్​పోర్టు పోలీస్​స్టేషన్​ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఇందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Constable
కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్​పోర్టు పీఎస్​ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య(Suicide)కు పాల్పపడ్డాడు. వికారాబాద్ జిల్లా ఎన్నికలతల గ్రామానికి చెందిన ఆశయ్య... చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం శనివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చాడు.

ఇతని డ్యూటీ అయిపోవడం వల్ల రిలీవర్ గదికి వచ్చి చూడగా ఫ్యాన్​కు ఉరివేసుకుని కనిపించాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేయగా శంషాబాద్ పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. ఆశయ్య ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్థిక పరిస్థితులు, ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Accident: ప్రయాణంలో ఉండగా ఊడిన బస్సు చక్రాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.