ఎస్సైపై అత్యాచార ఆరోపణలు.. సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు

author img

By

Published : Jul 10, 2022, 12:17 PM IST

Updated : Jul 10, 2022, 2:09 PM IST

ఎస్సైపై అత్యాచార ఆరోపణలు.. సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు

మల్కాజిగిరి సీసీఎస్ ఎస్సై పెళ్లి పేరిట తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శాఖాపరమైన విచారణ ప్రారంభించిన​ ఉన్నతాధికారులు.. విజయ్‌ను సస్పెండ్ చేశారు.

హైదరాబాద్‌లో మహిళపై కన్నేసిన ఓ పోలీసు అధికారి తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే రాష్ట్రంలో మరొకటి చోటుచేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ పోలీసు అధికారిపై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. మల్కాజిగిరి సీసీఎస్​లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్​పై నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. తనను ప్రేమించి.. పెళ్లి పేరుతో సహజీవనం చేసి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..

మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ యువతి, సూర్యాపేట జిల్లా దురాజ్​పల్లి గ్రామానికి చెందిన ఎస్సై ధరావత్​ విజయ్​లు కాలేజీ రోజుల(గత పదేళ్లుగా) నుంచి ప్రేమించుకుంటున్నారు. దూరపు బంధువులు, ఒకే కులానికి చెందిన వారు కావడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయ్​ యువతితో సహజీవనం చేశాడు. తీరాచూస్తే ఆరేళ్ల క్రితం విజయ్​ తన మేనమామ కూతురుని వివాహం చేసుకున్నాడు. (వారికి ఒక కుమారుడు ఉన్నాడు.) తన పరిస్థితి ఏంటని బాధిత యువతి ప్రశ్నిస్తే.. భార్యకు విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. ఆరేళ్ల నుంచి అదే సమాధానం చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.

ఎస్సై విజయ్​
ఎస్సై విజయ్​

బాధిత యువతిని వదులుకోవడం ఇష్టం లేదని చెబుతూ.. ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలనూ చెడగొడుతున్నాడు. ఇటు భార్యతో కాపురం, యువతితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని.. పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి విజయ్​ను కోరింది. అతను మళ్లీ పాత సమాధానాలే చెబుతూ.. దాటవేస్తుండటంతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనతో సహజీవనం చేసి మోసం చేశాడని విజయ్​పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు ఎస్సై విజయ్​పై ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన విచారణ ప్రారంభించిన పోలీస్​ ఉన్నతాధికారులు.. విజయ్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి..

రివాల్వర్​ గురిపెట్టి వివాహితపై అత్యాచారం.. మారేడుపల్లి సీఐ అరాచకం

ఉన్నతాధికారి వేధిస్తున్నాడంటూ సీఎస్​కు అటవీశాఖ మహిళా సూపరింటెండెంట్​ లేఖ

Last Updated :Jul 10, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.