ETV Bharat / crime

తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎందుకంటే?

author img

By

Published : Aug 4, 2022, 6:17 PM IST

Clash between Trs and Bjp: కరీంనగర్ జిల్లాలో తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుజురాబాద్​ నియోజకవర్గం అభివృద్దిపై చర్చకు రావాలని తెరాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఈటలకు సవాల్ విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

తెరాస, భాజపా
తెరాస, భాజపా

Clash between Trs and Bjp: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది . హుజురాబాద్​ నియోజకవర్గం అభివృద్దిపై చర్చకు రావాలని తెరాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఈటలకు సవాల్ విసిరారు. దానికి స్పందించిన ఈటల స్థాయికి తగని వారితో చర్చలు జరపనని అందుకు నిరాకరించారు. మరోవైపు తెరాస నాయకులు రేపు చర్చకు రావాలంటూ హుజూరాబాద్ బస్టాండ్ కూడలిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

దానికి ధీటుగా భాజపా నేతలు కూడా అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు యత్నించారు.ఈ క్రమంలో భాజపా, తెరాస నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. తెరాసకు చెందిన కౌన్సిలర్ భాజపా కార్యకర్తపై కర్రతో దాడిచేశాడు. దీంతో పరిస్థితి విషమించింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చచేప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీఐ శ్రీనివాస్‌ గాయాలయ్యాయి. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎందుకంటే?

ఇవీ చదవండి : సంగారెడ్డిలో విషాదం.. ఉరేసుకుని ముగ్గురి ఆత్మహత్య

దీదీ సర్కార్​ దిద్దుబాటు చర్యలు.. కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణ.. బాబుల్​ సుప్రియోకు చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.