ETV Bharat / crime

సాయిబాబా ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు

author img

By

Published : Oct 28, 2022, 4:10 PM IST

burglary in Sai Baba Temple at Abdullapurmet: దొంగతనం చేసేందుకు ఏకంగా గుడినే ఎంచుకున్నాడు ఓ ఘనుడు. ఎవరూ లేని సమయం చూసి ఎంచక్కా ఆలయంలోకి ప్రవేశించిన ఆ దొంగ.. తాళాలు పగులగొట్టి గుడిలోని హుండీని ఎత్తుకెళ్లాడు. ఇవన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

burglary in Saibaba Temple in Rangareddy
burglary in Saibaba Temple in Rangareddy

burglary in Sai Baba Temple at Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్‌లోని స్థానిక సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయం తాళాలు పగులగొట్టిన దొంగ.. గుడిలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చోరీని ఎవరు చేశారు.. స్థానికులా.. లేక బయటి వ్యక్తులా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సాయిబాబా గుడిలో చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.