ETV Bharat / crime

ఆత్మీయంగా మెలిగి... అవ్వను హతమార్చి

author img

By

Published : Mar 27, 2021, 7:56 PM IST

ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలికి నమ్మకంగా మారినట్లు నటించాడు. అదను చూసి.. అవ్వను హత్య చేసి.. బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా హుకుంపేట ఆదర్శనగర్​లో జరిగింది.

ap crime news, rjy murder
murder, crime news

ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలికి నమ్మకంగా ఉన్న వ్యక్తే ఆమె బంగారం కాజేయాలనే దురుద్దేశంతో హత్య చేశాడని.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ ఏఎస్పీ లతామాధురి తెలిపారు. శుక్రవారం బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వృద్ధురాలి హత్య కేసు వివరాలను వెల్లడించారు.

ఫిబ్రవరి 4న రాజమహేంద్రవరం గ్రామీణంలోని హుకుంపేట పంచాయతీ ఆదర్శనగర్‌లో ఒంటరిగా ఉంటున్న జంగా నారాయణమ్మ(60) హత్యకు గురైంది. ఈ కేసులో ఈ నెల 25న అదే ప్రాంతానికి చెందిన చుక్కా లోవరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లోవరాజు విజయవాడకు చెందినవాడనీ... పదేళ్ల కిందట రాజమహేంద్రవరం వచ్చి ఆటో నడుపుతూ జీవిస్తున్నాడని ఏఎస్పీ వివరించారు.. నారాయణమ్మ ఒంటరిగా ఉండడంతో ఆమెను బ్యాంకు, దేవాలయాలకు తీసుకెళ్తూ నమ్మకస్థుడిగా మారాడని తెలిపారు. వృద్ధురాలి వద్ద ఉన్న బంగారం అతడి కంట పడడంతో పథకం ప్రకారం ఆమె నోరు నొక్కి ఊపిరి అందకుండా చేసి హతమార్చి ... ఇంట్లో ఉన్న 116 గ్రాముల బంగారు వస్తువులతో పరారయ్యాడని వివరించారు. నిందితుడిపై గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ పలు చోరీ కేసులు ఉన్నాయి. అతడి నుంచి మొత్తం 116 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: సీఎం పీఏనంటూ నమ్మబలికి.. రూ.15 లక్షలు దండుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.