ETV Bharat / crime

సాఫ్ట్‌వేర్ దారుణ హత్య.. మందు తాగించి.. గొంతు నులిమి.. ఆపై పెట్రోల్‌ పోసి..

author img

By

Published : Jul 3, 2022, 11:05 AM IST

Updated : Jul 3, 2022, 4:22 PM IST

software engineer murder
software engineer murder

11:02 July 03

సాఫ్ట్‌వేర్ దారుణ హత్య.. మందు తాగించి.. గొంతు నులిమి.. ఆపై పెట్రోల్‌ పోసి..

Software murder: పిల్లలు ప్రేమించి పెళ్లిచేసుకోవడం కొంతమంది తల్లిదండ్రులకు నచ్చడం లేదు. కుల, మతాలు ఒక్కటి కాదనో, ఆస్తి లేదనో.. చిన్ననాటి నుంచి కంటికి రెప్పలా పెంచిన వారి అనుబంధాన్ని పక్కకు నెట్టి.. పరువుకోసమో, పంతం నెగ్గించుకునేందుకో హతమార్చేందుకు కూడా వెనుకాడటం లేదు. అచ్చం అలాంటి ఘటనే.. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీలో ఉంటున్న ఓ సాఫ్ట్​వేర్‌ ఉద్యోగి.. తమ కూతురిని ప్రేమవివాహం చేసుకున్నాడన్న కోపంతో.. అతిదారుణంగా హత్యచేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టటిన ఘటన వెలుగు చూడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే మొదట అదృశ్యం కేసుగా నమోదుచేసిన పోలీసులకు.. నిందితుల కదలికలపై నిఘా ఉంచడం వల్ల అసలు విషయం బయటపడింది.

ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు రాజుపాలెంకు చెందిన నారాయణ రెడ్డి(25) సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తూ.. స్నేహితులతో కలిసి కేపీహెచ్​బీ రోడ్​ నెంబర్​ 1లో ఉంటున్నాడు. అయితే.. నారాయణ తన గ్రామానికే చెందిన ఓ యువతిని చాలా రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారైనా.. యువతి తల్లిదండ్రులకు వీళ్ల ప్రేమ ఇష్టంలేదు. ఇక చేసేదేమీలేక పెద్దలకు తెలియకుండా.. ఏడాది క్రితమే పెళ్లిచేసుకుని హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు.. యువతిని స్వగ్రామానికి తీసుకెళ్లి గృహనిర్భంధం చేశారు. అయినా సరే.. ఇద్దరు ఫోన్లు మాట్లాడుకుంటుండటంతో.. తమ కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లిచేయాలని నిశ్చయించుకున్నారు. ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా.. యువతి తిరస్కరిస్తుండటంతో.. వాళ్లు ఓ సంచలన నిర్ణయానికి వచ్చారు. నారాయణరెడ్డి ఉంటేనే పెళ్లికి నిరాకరిస్తుందని... లేకపోతే తాము తెచ్చిన సంబంధం ఒప్పుకుంటుందని మూర్ఖంగా ఆలోచించారు. నారాయణరెడ్డిని అంతమొందించాలని పథకం పన్నారు.

కట్​ చేస్తే.. జూన్‌ 27 నుంచి నారాయణరెడ్డి కనిపించకపోయేసరికి అతని బంధువులు అన్ని చోట్లా వెతికారు. ఎలాంటి ఫలితం లేకపోవటంతో.. స్థానిక పోలీసులకు 30న ఫిర్యాదు చేశాడు. నారాయణరెడ్డి అదృశ్యంపై అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు అనుమానితులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే మృతుడి కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.

శ్రీనివాస్‌రెడ్డితో నారాయణరెడ్డికి ముందే పరిచయం ఉండటంతో జూన్‌ 27న కేపీహెచ్‌బీలో నారాయణరెడ్డి ఉంటున్న ఇంటికి అమ్మాయి తరఫు బంధువులతో వెళ్లారు. నారాయణను.. జియాగూడ వద్ద మద్యం కొనుగోలు చేసి.. ఓ చోట తాగారు. అనంతరం నారాయణరెడ్డిని గొంతు నులిమి హతమార్చి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. తమదైన శైలిలో అదే క్రమంలో అతడిని ఏమార్చి గొంతునులిమి చంపేశారు. అనతరం నారాయణ మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు అటవీ ప్రాంతంలో రహదారిపక్కన పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఘటనా స్థలాన్ని నిందితుని సహాయంతో కేపీహెచ్‌బీ పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహం 80 శాతం కలిపోయింది. అందులోనూ ఘటన జరిగి నాలుగు రోజులపైనే అవ్వడంతో మృతదేహం పాడైపోయింది. దీంతో మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.

మరో పక్క మృతుని స్వగ్రామానికి వెళ్లి కూడా పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఓ వ్యక్తికి సుఫారీ ఇచ్చి హత్య చేయించునట్లుగా కూడా అనుమానం వ్యక్తం అవుతోంది.

Last Updated :Jul 3, 2022, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.