ETV Bharat / crime

suspicious death: చెట్లపొదల్లో వ్యాపారి మృతదేహం

author img

By

Published : Jun 9, 2021, 5:19 PM IST

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి(suspicious death) చెందిన ఘటన హైదరాబాద్​లోని జవహర్ నగర్ పీఎస్​ పరిధిలో జరిగింది. చెట్లపొదల్లో మృతదేహం లభించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

a real estate merchant suspicious death
suspicious death: చెట్లపొదల్లో వ్యాపారి మృతదేహం

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి(suspicious death) చెందిన ఘటన హైదరాబాద్​లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బొల్లారం ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నవీన్​రెడ్డి మృతదేహం కౌకూర్ చెరువు వద్ద ఉన్న చెట్లపొదల్లో పోలీసులకు లభించింది. నవీన్ రెడ్డి ఈ నెల 5 నుంచి అదృశ్యమైనట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

స్థానికుల సమాచారం మేరకు ఈ రోజు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవీన్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పుల బాధతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

గతంలో కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 5 నుంచి అదృశ్యం అయిన అతను… ఈ రోజు కౌకూర్​లో చనిపోయి కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Murder attempt: ప్రముఖ వ్యాపారవేత్త వాసంతి శెట్టిపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.