దగ్గరి బంధువు అని భూ రిజిస్ట్రేషన్​ చేశాడు.. డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగాడు..

author img

By

Published : Sep 29, 2022, 6:58 PM IST

commit suicide

Suicide infront of police station: ఓ వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్​ తరువాత డబ్బుల విషయంలో తేడా రావడంతో పురుగుల మందు తాగాడు. అనంతరం పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తనను తన దగ్గరి బంధువులే మోసం చేశారని తెలిపారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పేర్కొన్నాడు.

Suicide infront of police station: పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్​ స్టేషన్​ వద్ద జరిగింది. బైరగోని తిరుపతి అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్​లో డబ్బుల విషయంలో​ తేడా రావడంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఇది​ గమనించిన పోలీసులు పురుగుల మందు తాగుతున్న తిరుపతిని అడ్డుకొని హుటాహుటిన 108 అంబులెన్స్​లో హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో తిరుపతి తన తల్లి పేరు మీద ఉన్న 4ఎకరాల 19గుంటల భూమిని తన సమీప బంధువుకు కోటి రూపాయలకు అమ్మదలచుకున్నాడు. అందుకుగానూ అతని దగ్గర నుంచి బాధితుడు 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బులకు నోటరీ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితుడు తిరుపతి తెలిపాడు. పెట్టుకున్న గడువు ముగిసి రెండు మూడు నెలలు గడుస్తున్న మిగిలిన 84 లక్షల రూపాయలను ఇవ్వలేదు.

దీనితో స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. అయినా పోలీసులు సరైనా వివరణ ఇవ్వకపోవడంతో పాటు, ఏవో సాకులు చెబుతూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగినట్లు పేర్కొన్నాడు. దగ్గరి బంధువు కావడం వల్ల పూర్తి డబ్బులు తీసుకోకముందే రిజిస్ట్రేషన్ చేశానని, ఇప్పుడు తమ డబ్బులు తమకు పూర్తిగా ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరుతున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.