crime: తమ బంధాన్ని ప్రేయసి భర్తకు చెప్పేశాడని.. స్నేహితుడిని ఏంచేశాడో తెలుసా?

author img

By

Published : Aug 25, 2021, 5:11 PM IST

attack with knife

వివాహేతర సంబంధం గురించి ఆమె భర్తకు చెప్పిన ఓ వ్యక్తిపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేశాడు. ఈఘటన హైదరాబాద్​ సంతోష్​నగర్​ ఠాణాపరిధిలో జరిగింది.

ఓ మహిళతో వివాహేతర సంబంధం స్నేహితుడిపై దాడికి పురిగొల్పింది. తాను ఓ మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి ఆమె భర్తకు చెప్పాడనే కోపంతో స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్​ సంతోష్​నగర్​ ఠాణా పరిధిలో జరిగింది.

ఇదీ జరిగింది

షాహీన్​నగర్​కు చెందిన అక్బర్​ఖాన్​, సంతోష్​నగర్​కు చెందిన మహ్మద్​ ఈషాఅలీ స్నేహితులు. అక్బర్​ఖాన్​ గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ మధ్యనే ఆమెకు మరో వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ ఆమెను తరచు కలుస్తున్నాడు అక్బర్​. తన స్నేహితుడు, మహిళకు మధ్య ఉన్న సంబంధం గురించి మహ్మద్​ ఈషాఅలీ... ఆమె భర్తకు చెప్పాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి ఇషా అలీని కలిసి అడిగాడు అక్బర్​ ఖాన్​. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈక్రమంలో అక్బర్​ఖాన్​ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఈషాఅలీపై దాడి చేశాడు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న సంతోష్​నగర్​ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. గాయపడిన ఈషాఅలీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: ACCIDENT: ఆటోను ఢీకొట్టిన లారీ.. తొమ్మిది మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.