ETV Bharat / crime

గ్యాస్​ సిలిండర్​ వాహనం​ ఢీ.. బాలుడు మృతి

author img

By

Published : Mar 10, 2021, 7:55 PM IST

గ్యాస్ సిలిండర్ వాహనం ఢీకొట్టడంతో 16 నెలల బాలుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల పట్టణంలోని ప్రమాదానికి కారణమైన గ్యాస్ ఏజన్సీ ముందు...బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

16 months old boy was dead in accident Jagitial district
గ్యాస్​ సిలిండర్​ వాహనం​ ఢీ.. బాలుడు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలలో గ్యాస్ సిలిండర్ వాహనం ఢీకొట్టడంతో... రియాన్స్ అనే 16 నెలల బాలుడు మృతి చెందాడు. కోరుట్లకు చెందిన శ్రీరామ గ్యాస్ ఏజన్సీ సిబ్బంది తాండ్రియాలకు గ్యాస్ సిలిండర్​ల సరఫరాకు వచ్చారు. ఆ సమయంలో బాలుడి తల్లి తేజస్విని సిలిండర్ తీసుకుని తన బిడ్డను అక్కడే నిలబెట్టి డబ్బుల కోసం ఇంట్లోకి వెళ్లింది. వ్యాన్​ డ్రైవర్ అది గమనించకుండా వాహనాన్ని వెనకకు తీస్తుండడంతో బాలుడు రియాన్స్ దాని కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.

వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రియాన్స్​ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల పట్టణంలోని గ్యాస్ ఏజన్సీ ముందు బాలుని మృతదేహంతో... బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి ఏజన్సీ నిర్వహకులలే కారణమని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పగిలిన గూడెం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌... నీటిపాలైన 200 ఎకరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.