ETV Bharat / crime

బోధన్​ జిల్లా ఆసుపత్రి వద్ద 10 నెలల చిన్నారి కిడ్నాప్​ చివరికి..?

author img

By

Published : Nov 15, 2022, 5:00 PM IST

10 Month Old Baby Kidnapp: నిజామాబాద్​, బోధన్​ జిల్లా ఆసుపత్రి వద్ద 10 నెలల పాప కిడ్నాప్​ అయిన ఘటన కలకలం రేపింది. పాపను కిడ్నాప్​ చేసిన లేడీ కిడ్నాపర్లను.. పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్​ వాసులుగా గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి చిన్నారిని తన తల్లి వద్దకు క్షేమంగా చేర్చారు.

బోధన్​ జిల్లా ఆసుపత్రి వద్ద 10 నెలల చిన్నారి కిడ్నాప్​ చివరికి..?
బోధన్​ జిల్లా ఆసుపత్రి వద్ద 10 నెలల చిన్నారి కిడ్నాప్​ చివరికి..?

10 Month Old Baby Kidnapp: బోధన్ జిల్లా చిన్నమావందికి చెందిన మేకల లక్ష్మీ తన (10)నెలల చిన్నారిని చికిత్స నిమిత్తం ఈ నెల 7న ఆసుపత్రికి తీసుకొచ్చింది. రెండు రోజులు చికిత్స పూర్తిచేసుకొని ఊరికి వెళ్తొంది. ఈ క్రమంలో ఆసుపత్రి సమీపంలో ఉన్న మసీదు వద్ద కాళ్లుచేతులు కడుకుందామని పాపను పక్కన కూర్చొబెట్టింది. అదే అదునుగా భావించిన లేడీ కిడ్నాపర్​ గంగామణి పాపను అపహరించి తన స్నేహితురాలైన అంజలి వద్దకు చేర్చింది. చిన్నారి కనబడకపోవడంతో లక్ష్మి ఏడుస్తూ ఉండగా.. గంగామణి ఏమీ తెలియనట్టు ఆమెను ఓదార్చి వింతనాటకం మొదలుపెట్టింది.

రెండు, మూడు రోజులు పాపని వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో లక్ష్మి ఈ నెల 12న పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్​ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు.. పాప మిస్సైన ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్​ ద్వారా అనుమానితురాలిని గుర్తించి, విచారించగా.. గంగామణి పాపను అపహరించి తన స్నేహితురాలు అంజలికి ఇచ్చిందని విచారణలో తేలింది. అంజలిని తీసుకొచ్చి పోలీసులు విచారణ చేయగా హైదరాబాద్​కు చెందిన షమీమ్ బేగం బ్రోకర్ సహాయంతో పర్వీన్ బేగంకి పాపను అమ్మాననీ చెప్పడంతో పోలీసులు హైదరాబాద్ వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి, పాపను తీసుకొచ్చారు. పాపను తల్లికి అప్పజెప్పామని.. ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.