ETV Bharat / city

బొమ్మ రూపంలో అమ్మ ప్రేమ.. అంతటా అనురాగమే

author img

By

Published : Oct 11, 2020, 9:21 AM IST

అమ్మ ప్రేమను అక్షరాల్లో బంధించాలంటే..ఎన్ని భాషల సాయమడిగినా అవన్నీ నిస్సహాయంగా చేతులెత్తేస్తాయి. పోనీ పాట రూపంలో ఆలపించాలంటే.. ఆమె అందించే అనురాగం ముందు ఏ రాగమైనా చిన్నబోతుంది.

mother and daughter idols
బొమ్మ రూపంలో అమ్మ ప్రేమ

అమూల్యమైన అమ్మ ప్రేమను బొమ్మల రూపంలో చూపించే ప్రయత్నం చేస్తోంది వరంగల్‌ మహానగర పాలక సంస్థ. నగర సుందరీకరణలో భాగంగా పలు చోట్ల తల్లీబిడ్డల విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది.

మున్సిపల్‌ కార్యాలయంలోని వనితా వనంలో తల్లీబిడ్డల విగ్రహం, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రవేశద్వారం ముందు రామప్ప శిల్ప శైలిని తలపించే నిలువెత్తు విగ్రహం ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.