గవర్నర్‌ వ్యవస్థను కించపరిచే చర్యలకు పాల్పడుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Sep 8, 2022, 9:03 PM IST

Minister Errabelli on Governor comments

Minister Errabelli on Governor comments: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు స్పందించారు. భాజపా కార్యకర్తలతో తమిళిసై సమావేశాలు పెట్టడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ వ్యవస్థను కించపరిచే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో వచ్చిన గవర్నర్‌లు ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా అని ప్రస్తావించారు.

Minister Errabelli on Governor comments: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ వ్యవహార శైలిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈ రోజు రాజ్​భవన్​లో గవర్నర్​ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై హుందా తనాన్ని కోల్పోతున్నారన్నారు. గవర్నర్‌ వ్యవస్థను కించపరిచే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్​గా ఆమె చర్యలు ప్రజలను బాధపెడుతున్నాయని పేర్కొన్నారు. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణలో భాజపా కార్యకర్తలా వ్యవహరిస్తూ.. ఈ పార్టీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరపడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను కించపరచడం వల్లే తమిళిసైకి త‌గిన‌ గౌరవం దక్కడం లేదని ప్రస్తావించారు. గవర్నర్ హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.

'భాజపా కార్యకర్తలతో తమిళిసై సమావేశాలు పెట్టడం సరైన విధానం కాదు. గవర్నర్‌ వ్యవస్థను కించపరిచే చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో వచ్చిన గవర్నర్‌లు ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా?. మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రిగా కనీసం నాకు ఇవ్వ‌లేదు. ద‌యచేసి హుందాగా ప్ర‌వ‌ర్తించాల‌ని గ‌వ‌ర్న‌ర్ గారికి విజ్ఞ‌ప్తి చేస్త‌ున్న‌ాను. గవర్నర్ తమిళిసైని తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నాం.'- ఎర్రబెల్లి దయాకర్​రావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

గవర్నర్​ భాజపా డైరెక్షన్​లో పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. సమస్యలపై ఆదేశాలు ఇవ్వాల్సిన గవర్నర్ రాష్ట్రాన్ని, ప్ర‌భుత్వాన్ని కించపరుస్తూ తిరగడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య‌శాల‌లపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారు.. ప్ర‌జ‌ల‌కు తెలంగాణలో ఇస్తున్నంత మెరుగైన వైద్యం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తున్నారన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చేది లేదు.. పుచ్చేది లేదు ప్రధాని సమావేశాలకు గ‌వ‌ర్న‌ర్ ఎందుకు వెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ద‌యచేసి హుందాగా ప్ర‌వ‌ర్తించాల‌ని గ‌వ‌ర్న‌ర్ గారికి విజ్ఞ‌ప్తి చేస్త‌ున్న‌ అని మంత్రి ప్రస్తావించారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చేలా ప్ర‌వ‌ర్తించాల‌ని చేతులెత్తి మొక్కుతున్నా అని మంత్రి హాట్ కామెంట్స్ చేశారు.

గవర్నర్‌ వ్యవస్థను కించపరిచే చర్యలకు పాల్పడుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.