ETV Bharat / city

YS Sharmila Hunger Strike: కేసీఆర్​కు మద్యంపై ఉన్న ప్రేమ.. రైతుల మీద లేదు: వైఎస్​ షర్మిల

author img

By

Published : Nov 9, 2021, 10:11 PM IST

Updated : Nov 9, 2021, 10:36 PM IST

ys sharmila
ys sharmila

రాష్ట్రాన్ని బీర్ల తెలంగాణగా మార్చారని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల విమర్శించారు. మద్యం నియంత్రించాల్సింది పోయి.. వ్యవసాయాన్ని నియంత్రిస్తున్నారని సీఎం కేసీఆర్​పై వైఎస్​ షర్మిల మండిపడ్డారు

వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిందేనని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల డిమాండ్​ చేశారు. నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం చౌడంపల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు.

సీఎం కేసీఆర్​ మొదట్లో ప్రతి గింజా కొంటామని చెప్పారని.. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతామన్నారని షర్మిల చెప్పారు. ఇప్పుడేమె వరి సాగుచేయొద్దని.. కేంద్రం వద్దంటోందని.. కేంద్రప్రభుత్వంపై నెపం మోపుతున్నారని షర్మిల మండిపడ్డారు.

దివంగత రాజశేఖర్​రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నల్గొండకు 30 సార్లు వచ్చారని వైఎస్​ షర్మిల అన్నారు. జిల్లాలోని ఫ్లోరైడ్​ బాధితుల కోసం రాజశేఖర్​రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు 80 శాతం పూర్తయిందని.. కేవలం మిగిలిన 20 శాతం ఇప్పటి దాకా పూర్తిచేయలేదని షర్మిల మండిపడ్డారు. రాజశేఖర్​రెడ్డి బతికుంటే ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తై నేటికి ఓ దశాబ్దం అయ్యేదన్నారు.

రాష్ట్రంలో ఎందరో అత్యాచారాలకు గురవుతున్నారని వైఎస్​ షర్మిల ఆరోపించారు. రాష్ట్రాన్ని బీర్ల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ఉన్నదాంతో పాటు 400 మద్యం దుకాణాలకు కొత్తగా అనుమతులిచ్చారని... మద్యం నియంత్రించాల్సింది పోయి.. వ్యవసాయాన్ని నియంత్రిస్తున్నారని కేసీఆర్​పై వైఎస్​ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు.

YS Sharmila Hunger Strike: మద్యాన్ని వదిలేసి వ్యవసాయాన్ని నియంత్రిస్తున్నారు: వైఎస్​ షర్మిల

ఇదీచూడండి: Bandi sanjay comments on kcr speech: కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్..

Last Updated :Nov 9, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.