DALIT BANDHU: 12,521 లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ

author img

By

Published : Sep 8, 2021, 4:28 AM IST

harish

హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకంలో భాగంగా 12,521 లబ్ధిదారుల ఖాతాలో నగదు జమచేసినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. కరీంనగర్‌ కలెక్టరేట్​ దళితబంధుపై మంత్రులు హరీశ్, గంగుల, కొప్పుల సమీక్ష నిర్వహించారు. దళితబంధు సర్వేలో కార్లు, ట్రాక్టర్ల కొనుగోలుకు 6,400 మంది ఆప్షన్ ఇచ్చారని.. ఇన్ని కార్లు, ట్రాక్టర్లు ఇవ్వడం కష్టం కనుక.. అధికారులు మరోసారి వారి ఇంటికి వెళ్ళి ప్రత్యామ్నాయ ఉపాధి యూనిట్ల పట్ల కౌన్సిలింగ్ చేయాలని అధికారులకు సూచించారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకంలో భాగంగా 12,521 లబ్ధిదారుల ఖాతాలో నగదు జమచేసినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. కార్లు, ట్రాక్టర్లకు ఆప్షన్లు ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయ స్కీములు ఎంపిక చేసుకోవాలని కౌన్సిలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్‌ కలెక్టరేట్​ దళితబంధుపై సమీక్ష నిర్వహించిన మంత్రులు హరీశ్​రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌.. దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లతో దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మిగతా లబ్ధిదారుల ఖాతాల్లో వేగంగా దళిత బంధు డబ్బులు జమ చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. దళితబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అయిన అందరికి సెల్​ఫోన్​లో తెలుగులో మెస్సేజ్ పంపించాలని మంత్రులు ఆదేశించారు. దళిత బంధు సర్వే సందర్భంగా అందుబాటులో లేని వారి కోసం ఈనెల 12నుంచి వారం రోజుల పాటు రీ వెరిఫికేషన్ నిర్వహించాలని ఆదేశించారు.దళిత బంధు పథకం కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. డబ్బులు వద్దని, తిరిగి ఇచ్చినందుకు మంత్రులు అభినందనలు తెలిపారు.

దళితబంధు పథకంలో డైయిరీ యూనిట్లను ఎంచుకున్న లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యతగా కరీంనగర్, విజయ డైరీ భాగస్వామ్యంతో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని మంత్రులు నిర్ణయించారు. దళితబంధు సర్వేలో కార్లు, ట్రాక్టర్ల కొనుగోలుకు 6,400 మంది ఆప్షన్ ఇచ్చారని.. ఇన్ని కార్లు, ట్రాక్టర్లు ఇవ్వడం కష్టం కనుక.. అధికారులు మరోసారి వారి ఇంటికి వెళ్ళి ప్రత్యామ్నాయ ఉపాధి యూనిట్ల పట్ల కౌన్సిలింగ్ చేయాలని అధికారులకు సూచించారు.

ఇవీ చూడండి: PROBLEMS WITH FLOODS: వాగులు పొంగుతున్నాయి.. ప్రాణాలను బలిగొంటున్నాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.