ETV Bharat / city

SonuSood Phone call to Chandrababu: 'శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరం'

author img

By

Published : Nov 21, 2021, 6:47 PM IST

మీడియా సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు కంటతడి పెట్టడంపై ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ​(SonuSood Phone call to Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు సోనూ ఫోన్​ చేసి పరామర్శించారు.

sonusood
సోనూ సూద్​

తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రముఖ నటుడు సోనూసూద్‌(Sonu Sood Phone call to Chandrababu) ఫోన్ చేశారు. చంద్రబాబును పరామర్శించారు. ఏపీ శాసన సభలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబుతో చెప్పారు.

ఉదయం రజనీకాంత్ ఫోన్..

ఇవాళ ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును ఫోన్​లో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(rajinikanth phone call to cbn) పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని.. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నందమూరి కుటుంబ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. హద్దులు దాటి మాట్లాడొద్దంటూ.. తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయటం దారుణమన్న వారు.. తీరు మార్చుకోపోతే భరతం పడతామని హెచ్చరించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని, సంబంధిత నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందమూరి బాలకృష్ణ, స్వాతి, కల్యాణ్‌రామ్‌, నందమూరి జయశంకర కృష్ణ, గారపాటి లోకేశ్వరి, గారపాటి శ్రీనివాస్‌, నందమూరి వసుంధర, నందమూరి సుహాసిని, నందమూరి చైతన్యకృష్ణ, కామినేని సీమంతిని, కంఠమనేని ఉమామహేశ్వరి, శ్రీనివాస ప్రసాద్‌, నందమూరి జయశ్రీ రామకృష్ణ సహా పలువురు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు మాట్లాడారు.

ఎన్టీఆర్​ స్పందన

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన.. తన మనసును కలిచివేసిందని ప్రముఖ నటుడు జూనియర్​ ఎన్టీఆర్​ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ.. అవి ప్రజా సమస్యలపై జరగాలని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని జూనియర్ ఎన్టీఆర్‌(jr. ntr reacts on chandrababu crying) అభిప్రాయపడ్డారు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది అని వ్యాఖ్యానించారు. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని.. వాటిని భావితరాలకు జాగ్రత్తగా అప్పగించాలన్నారు. కుమారుడు, భర్త, తండ్రిగా.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ట్విట్టర్​ వేదికగా వీడియో సందేశంలో తెలిపారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలపై పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు.

ఇదీ చదవండి: Bandi Fires on KCR: 'కేసీఆర్‌ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా, పంజాబ్‌ రైతుల కోసమా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.