ETV Bharat / city

సోనియాగాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా చీరల పంపిణీ

author img

By

Published : Dec 9, 2020, 11:35 AM IST

కరీంనగర్​లోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​... 750 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

congress leader distributed sarees in karimnagar
congress leader distributed sarees in karimnagar

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ జన్నదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్​ కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​... మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని పొన్నం తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు జీవించి... ప్రజలకు సేవలు అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. వేడుకల్లో భాగంగా 750 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి పొన్నం ప్రభాకర్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో తెరాస అభ్యర్థి విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.