ETV Bharat / city

మై జీహెచ్ఎంసీ యాప్​లో ఓటర్ స్లిప్​, పోలింగ్ కేంద్రం లొకేషన్

author img

By

Published : Nov 28, 2020, 5:06 PM IST

నగర ఓటర్ల సౌకర్యార్థం బల్దియా మై జీహెచ్​ఎంసీ యాప్​ రూపొందించింది. ఓటరు స్లిప్ డౌన్​లోడ్​, పోలింగ్​ బూత్​ వివరాలను యాప్​ ద్వారా పొందవచ్చని తెలిపింది. ఓటర్ స్లిప్​తోపాటు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్​ మ్యాప్​తో సహా వస్తుంది.

voter slip download polling center location details from my ghmc app
మై జీహెచ్ఎంసీ యాప్​లో ఓటర్ స్లిప్​, పోలింగ్ కేంద్రం లొకేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటరు స్లిప్ డౌన్​లోడ్, పోలింగ్ బూత్ వివరాలను మై జీహెచ్ఎంసీ యాప్​లో బల్దియా పొందుపర్చింది. ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం వివరాలే కాకుండా... పోలింగ్​ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్​ మ్యాప్​ కూడా అందుబాటులో ఉంచారు. నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్​ ఫోన్​లు ఉన్నందున... ఈ సౌకర్యాన్ని రూపొందించారు.

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్​లో మైజీహెచ్ఎంసీ యాప్​లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్​ క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు వివరాలు ఎంటర్​ చేసి... పూర్తి వివరాలు పొందవచ్చు. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్ వస్తుంది. ఈ యాప్ పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్ ద్వారా బల్దియా సమాచారం అందిస్తోంది.

ఇదీ చూడండి: ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.