Autocracy startup : రైతుల కోసం ఇద్దరు స్నేహితుల కృషి.. చక్ర -100 డిచర్​తో లాభాలెన్నో..

author img

By

Published : Nov 26, 2021, 12:24 PM IST

Autocracy startup,advanced machines for farming

ఈ యంత్రం భలేగా ఉంది కదూ..! కూలీల కొరత వేధిస్తున్న తరుణంలో... తక్కువ సమయంలో పని కానిచ్చేస్తోంది. దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేదు. ఇది మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తి. తయారు చేసింది... ఇద్దరు స్నేహితులు. ఈ యంత్రం ఆవిష్కరణ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

రైతుల కోసం ఇద్దరు స్నేహితుల కృషి

Advanced machines for farming: ప్రస్తుత టెక్‌ యుగంలో అన్ని రంగాల్లో నయా యంత్రాలు వచ్చాయి. రోజుల తరబడి చేసే పనులు.. గంటల్లో చేసేస్తున్నాయి. ఐతే... ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకోవడంలో వ్యవసాయ రంగం వెనుకబడి ఉంది. అక్కడక్కడ ఉపయోగిస్తున్నప్పటికీ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా ఉన్నవి చాలా తక్కువ. ఈ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మిత్రులు. తక్కువ ఖర్చుతో అధునాతన వ్యవసాయ యంత్రాలు తయారు చేస్తున్నారు.

మోడ్రన్ మెషీన్స్​పై ఆసక్తి

Autocracy startup Hyderabad: లక్ష్మణ్, సంతోషిలు ఇద్దరూ స్నేహితులు. వీరి కుటుంబాలు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్​లో నివాసముంటున్నాయి. లక్ష్మణ్ డబుల్ ఎంబీఏ చేయగా, సంతోషి ఐఐటీలో మెటలాజికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. వ్యవసాయ రంగంలో మోడ్రన్‌ మిషన్స్‌ అందుబాటులోకి తీసుకురావాలనే తపనతో... ఆటోక్రసీ అనే స్టార్టప్‌ ఏర్పాటు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా వంటి దేశాల్లోని డిచర్‌లను పరిశీలించారు. వాటి నమూనాలు సేకరించి... మన నేలకు తగ్గట్లుగా డిచర్‌లు తయారు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వ్యవసాయం చేసుకునేందుకు వాడుతున్న పరికరాలపై అధ్యయనం చేశారు.


చక్ర -100 పని తీరు..

సులభంగా వాడుకునే విధంగా డిచర్‌లు రూపొందించారు. ఈ డిచర్ సాయంతో ఒక అడుగు నుంచి ఒకటిన్నర అడుగు వరకు లోతులో, ఒక అడుగు వెడల్పులో సులభంగా తవ్వుకునే వెసులుబాటు ఉంటుంది. రైతులకు అందుబాటులో ఉన్న ఏ ట్రాక్టర్ వెనకభాగానికైనా దీన్ని అమర్చుకునే విధంగా తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు.. చక్ర -100 అని పేరు పెట్టారు. వీటిని కేవలం వ్యవసాయానికి(farmers machinery) మాత్రమే కాకుండా...డ్రిప్ ఇరిగేషన్ కు అవసరమైన కేబుళ్లు ఏర్పాటు చేసేందుకు ఈ డిచర్ బాగా ఉపయోగపడుతుంది. డిచర్ ధర జీఎస్టీ లేకుండా సుమారు రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఉపయోగపడే విధంగా చక్ర-100 రూపొందించారు. వీటికి సంబంధించిన సర్వీస్, స్పేర్ పార్ట్ లు కూడా వీరే అందజేస్తున్నారు. తయారీదారులు వీరే కాబట్టి... రైతులు కానీ, డీలర్లు కానీ.. నేరుగా వీరిని సంప్రదించి... అదనంగా మార్పులు చేర్పులు చేయడమని అడగవచ్చు. సూచనల మేరకు అదనపు హంగులతో తయారు చేసి ఇచ్చేందుకు వీరు సిద్ధంగా ఉన్నారు.

నెలకు ఐదు డిచర్​లు

ప్రస్తుతం నెలకు ఐదు నుంచి ఆరు డిచర్‌లు తయారు చేస్తున్నారు. భవిష్యత్‌లో నెలకు వెయ్యి డిచర్‌లు తయారు చేసే స్థాయికి చేరుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు... ఆటోక్రసీ వ్యవస్థాపకులు. ప్రస్తుతం వీరు సొంతంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు. డీలర్ల తరపున వీటిని అద్దెకు కూడా ఇవ్వాలనే ఆలోచనల్లో ఉన్నారు. ఇలా... అన్ని ప్రాంతాలకు చెందిన రైతులకు చేరువయ్యేలా వీలైనన్ని మార్గాల్లో పయనించేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: ప్రేమ-పరిమళం కలగలిసిన ఈ పాన్​ ఖరీదు రూ.లక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.