Basthi dawakhana: మరో 32 బస్తీ దవాఖానాలు ప్రారంభం.. ఎక్కడెక్కడంటే?

author img

By

Published : Dec 3, 2021, 4:35 PM IST

Basthi dawakhana in hyderabad
Basthi dawakhana in hyderabad ()

Basthi dawakhana: బస్తీ దావాఖానాల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఇవాళ నూతనంగా 32 బ‌స్తీ దవాఖానాల‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకోచ్చింది. సికింద్రాబాద్​ ఓల్డ్​ బోయినపల్లిలోని శాంతినికేతన్​ కమ్యూనిటీ హాల్​లో మంత్రి హరీశ్​రావు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్​పేట్​ రాజీవ్​గాంధీ నగర్​ ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Basthi dawakhana: గ్రేట‌ర్​ హైద‌రాబాద్​ పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు.. బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తోంది. ఇవాళ మరో 32 దవాఖానాలను మంత్రులు ప్రారంభించారు. గోషామహల్ నియోజకవర్గపరిధిలోని దూల్​పేట చంద్రకిరణ్​ బస్తీలో దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​, ఖైరతాబాద్ మహాభారత్​నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు.

  • MA&UD Minister @KTRTRS inaugurated a Basthi Dawakhana in Shaikpet, Hyderabad. Jubilee Hills MLA @magantigopimla also participated.

    OPD consultation, tele-consultation, Basic Lab Diagnosis, treatment of simple illness and immunisation are the services offered in these clinics. pic.twitter.com/P4Qviov6FI

    — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మొత్తం 258 బస్తీ దవాఖానాలు..

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ ప్రారంభించిన 32 బస్తీ దవాఖానాలతో కలిపి మొత్తం సంఖ్య 258కి చేరింది. బస్తీ దవాఖానాల ద్వారా ప్రస్తుతం రోజుకు సుమారు 25 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. కొత్తగా ఏర్పాటుచేసిన వాటితో మరో 5 వేలమందికి వైద్య సేవలు అందనున్నాయి.

  • ఓల్డ్ బోయిన్ పల్లి, శాంతినికేతన్ కాలనీలో బస్తీ దవాఖాన ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. అనంతరం టీకాలు తీసుకున్నారా లేదా అని కాలనీలో ఇంటింటికీ తిరిగి పరిశీలించారు.

    టీకాలు తీసుకోవాలని స్వయంగా ప్రచారం చేశారు. అలాగే సంచార కొవిద్ టీకా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. pic.twitter.com/UyKW6oGWTq

    — Office of Minister for Health, Telangana (@TelanganaHealth) December 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హైదరాబాద్​-సికింద్రాబాద్​ జంట నగరాల్లో మొత్తం 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టికి 258 అందుబాటులోకి రాగా... ఇంకా 7 బస్తీ దవాఖానాల పనులు జరుగుతున్నాయి. 35 బస్తీ దవాఖానాలకు సంబంధించిన స్థల అన్వేషణ జరుగుతోంది. వీటితో పాటు మరో 50కి సంబంధించి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభం..

Basthi dawakhanas in hyderabad: ఇవాళ లలితాబాగ్​, రియసాత్​నగర్, కంచన్​బాగ్, నవాబ్​సాహెబ్​కుంట, రామ్​నాస్​పుర, టోలిచౌకీ, పురానాపూల్, రెయిన్​బజార్, ఖైరతాబాద్, షేక్​పేట్, జూబ్లీహిల్స్ సింగడి బస్తీ కమ్యూనిటీ హాల్, గోషామహల్ దూల్​పేట్​ చంద్రకిరణ్ బస్తీ కమ్యూనిటీ హాల్, మల్లేపల్లి జకీర్​ హుస్సేన్​ కమ్యూనిటీ హాల్, గోల్నాక కమగారినగర్​ కమ్యూనిటీ హాల్, యూసఫ్ గూడ కమ్యూనిటీహాల్, బన్సిలాల్​పేట్​ హమాలీ బస్తీ కమ్యూనిటీ హాల్, నాచారం అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్, చిలుకానగర్​ కమ్యూనిటీ హాల్, అబ్సిగూడ రామంతపూర్​ జడ్​పీహెచ్​ స్కూల్​, ఓల్డ్ బోయిన్​పల్లి వార్డు ఆఫీస్​, ఫిరోజ్​గూడ వార్డు ఆఫీస్, చింతల్​ ఎన్​ఎల్​బీ కమ్యూనిటీహాల్, సుభాష్​నగర్​ అపురూప కాలనీ కమ్యూనిటీహాల్, మచ్చబొల్లారం కౌకూర్​మెయిన్​ రోడ్డు హనుమాన్​ టెంపుల్ దగ్గర, వెంకటాపురం గోకుల్ నగర్​ పార్కు, నేరెడ్​మెట్​ చెక్​పోస్ట్ కమ్యూనిటీ హాల్ యాప్రాల్, గౌతంనగర్​ ఓల్డ్ మిర్జల్​గూడ శ్రీనివాసనగర్ కమ్యూనిటీహాల్​, హైదర్​నగర్​వార్డు ఆఫీస్​, హైదర్​గూడ, శేరిలింగంపల్లి ముస్లీం బస్తీ, నెహ్రునగర్ కమ్యూనిటీహాల్, చందానగర్ పాపిరెడ్డి కమ్యూనిటీహాళ్లలో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.

బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు...

ఈ బస్తీ దవాఖానాల్లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు. ఇవే కాకుండా నగరంలో 85 అర్బన్​ హెల్త్​ సెంట‌ర్లూ వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ బస్తీ దవాఖానాల్లో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడం సహా బీపీ, షుగర్​తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. ఇక్కడ సేకరించిన న‌మూనాలను తెలంగాణ స్టేట్ డ‌యాగ్నస్టిక్​ సెంటర్​కు పంపిస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తారు. స్వల్పకాల అనారోగ్యానికి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సహా టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారు.

ఇదీచూడండి: Harish Rao on Omicron: 'ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.