ETV Bharat / city

KTR At Kandlakoya IT Park: తెలంగాణకు తలమానికం గేట్​ వే ఆఫ్​ ఐటీ పార్క్​

author img

By

Published : Feb 17, 2022, 12:56 PM IST

Updated : Feb 18, 2022, 5:13 AM IST

KTR At Kandlakoya IT Park: హైదరాబాద్​ కండ్లకోయలో ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. పది ఎకరాల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఐటీ పార్కును నిర్మిస్తున్నారు. ఐటీ పార్క్‌తో కండ్లకోయ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని కేటీఆర్​​ ఆశాభావం వ్యక్తం చేశారు.

minister ktr at kandlakoya It park
minister ktr

KTR At Kandlakoya IT Park: కేసీఆర్​ రాజకీయాలను వీడి ఉంటే తెలంగాణ వచ్చేదా: కేటీఆర్​

KTR At Kandlakoya IT Park: చివరి వరకు పట్టుదలతో పోరాడితేనే విజయం లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా తొలి ఎన్నికలో ఓడిపోయారని కేటీఆర్‌ చెప్పారు. తొలి ఓటమితో నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో కొనసాగారన్నారు. రాజకీయాల్లో కొనసాగి పట్టువిడవని పోరాటంతో తెలంగాణను సాధించారని పేర్కొన్నారు. ఒకవేళ కేసీఆర్‌ రాజకీయాలను వీడితే ఇవాళ తెలంగాణ సాధించి ఉండేవాళ్లమా? అని కేసీఆర్​ అన్నారు.

తెలంగాణ గేట్‌వే..

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా హైదరాబాద్​ కండ్లకోయలో ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. తెలంగాణ గేట్‌వే పేరిట మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ ఓఆర్‌ఆర్‌ భారీ ఐటీ పార్క్​ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.వంద కోట్ల ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పది ఎకరాల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఐటీ పార్కును నిర్మిస్తున్నారు. ఫలితంగా 5 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి రానుంది. ఈ ఐటీ పార్కులో 70 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ఈ భాధ్యతలను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే 70కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.

ఐటీ పార్క్‌తో కండ్లకోయ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని కేటీఆర్​​ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే టాప్‌-5 కంపెనీల క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని కేటీఆర్​ చెప్పారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి సంస్థల అతిపెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. పలు సంస్థలకు అమెరికా వెలుపల ప్రధాన క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

'ప్రభుత్వ ప్రాధాన్యతల్లో హైదరాబాద్​ ఐటీ రంగం ఒకటి. కేంద్ర సగటును మించి రాష్ట్ర ఐటీ రంగం వృద్ధి నమోదుచేస్తోంది. కొవిడ్ పరిస్థితుల్లోనూ మన ఐటీరంగం రెండంకెల వృద్ధిని నమోదు చేసి సత్తా చాటింది. ఐటీని హైదరాబాద్ పశ్చిమ వైపునే కాకుండా.. నగరం నలువైపులా, రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా గ్రిడ్ పాలసీని రూపొందించాం. హైదరాబాద్ తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఏర్పాటుచేసి కంపెనీలు నెలకొల్పేలా ప్రోత్సాహం అందిస్తున్నాం. ఈ ఐటీ పార్క్​లో 50 వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.'

- కేటీఆర్​, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి

హైదరాాబాద్​ వ్యాక్సిన్​ కేపిటల్​..

Ktr on Investments: దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్రం 5 శాతాన్ని అందిస్తోందని కేటీఆర్​ చెప్పారు. హైదరాబాద్‌కు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఎంఆర్‌ఎఫ్‌ సంస్థ మరో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఉదయం ప్రభుత్వాన్ని సంప్రదించిందని కేటీఆర్​ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం టీకాల ఉత్తత్తిలో మూడో వంతు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. హైదరాబాద్​ ప్రపంచానికే వ్యాక్సిన్​ కేపిటల్​గా ఎదిగిందని కేటీఆర్​ పేర్కొన్నారు.

కొంపల్లి పరిసరాల్లో ఐటీ పార్క్​ ఏర్పాటుచేయాలని స్థానిక ప్రజాప్రతినిథులు, కొంపల్లి ఐటీ ఎంటర్​ ప్రైజ్ అసోసియేషన్ నుంచి వినతులు వచ్చాయి. స్పందించి ప్రభుత్వం 'గేట్​వే ఆఫ్ తెలంగాణ' పేరుతో భారీ ఐటీ పార్కుకు అంకురార్పన చేసింది. ప్రభుత్వం నిర్మించే అతిపెద్ద కట్టడాల్లో ఈ 'గేట్​వే ఆఫ్ తెలంగాణ' ఐటీ పార్క్​ ఒకటి. ఇది సైబర్​ టవర్స్​ కంటే పెద్దది.

- కేటీఆర్​, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి

కేసీఆర్ స్ఫూర్తిగా..

నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కుతాయన్న కేటీఆర్​.. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుని ఉద్యోగాలు దక్కించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ స్ఫూర్తిగా అందరూ పట్టువదలకుండా పోరాడాలని విద్యార్థులకు కేటీఆర్​ సూచించారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడున్నరేళ్లలోనే నిర్మించామని కేసీఆర్​ అన్నారు. మేడిగడ్డ నుంచి మేడ్చల్‌కు గోదావరి జలాలు తీసుకొచ్చామని చెప్పారు. ఇన్నాళ్లు చైనా వాళ్లు.. ఎదో గొప్పగా నిర్మించారని, చేశారని చెప్పుకున్నామన్న కేటీఆర్​... వారందరికీ పాఠాలు నేర్పించే విధంగా ఎదుగుతున్నామన్నారు. కేసీఆర్​ జన్మదినం సందర్భంగా... ఈ కార్యక్రమం వేదికపై.. మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్​ భారీ కేక్​ కట్​ చేశారు.

ఇదీ చదవండి: Revanth Reddy Arrest : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్

Last Updated :Feb 18, 2022, 5:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.