TRS mlc candidates: తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

author img

By

Published : Nov 21, 2021, 7:11 PM IST

Updated : Nov 21, 2021, 7:38 PM IST

trs

19:10 November 21

తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు

రాష్ట్రంలో స్థానిక సంస్థల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల(Local body mlc elections telangana 2021) పేర్లు దాదాపు ఖరారయ్యాయి. 12 మంది అభ్యర్థుల పేర్లను అధికార పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. కాగా రేపు, ఎల్లుండి తెరాస అభ్యర్థులు(TRS mlc candidates) నామినేషన్లు వేయనున్నారు.  

అభ్యర్థుల పేర్లు

  • ఖమ్మం- తాత మధు, ఆదిలాబాద్- దండే విఠల్
  • మహబూబ్‌నగర్‌- సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి
  • రంగారెడ్డి - శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్ రెడ్డి
  • వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ- ఎం.సి. కోటిరెడ్డి
  • తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు: మెదక్-  యాదవ రెడ్డి
  • కరీంనగర్ - ఎల్ రమణ, భానుప్రసాద రావు
  • నిజామాబాద్- కల్వకుంట్ల కవిత లేదా ఆకుల లలిత

ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా అభ్యర్థిత్వాలను తెరాస బహిరంగంగా ప్రకటించలేదు. అభ్యర్థులు నేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల కోటా అభ్యర్థుల్లో కొందరికి ఇప్పటికే నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని తెరాస అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.  

డిసెంబరు 10న పోలింగ్​

స్థానిక సంస్థల కోటా(MLC elections Telangana 2021)లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16న నామినేషన్లు ప్రారంభం కాగా 23 వరకు నామపత్రాలు స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉండగా... ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం ఉంది. మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది.

స్థానిక సంస్థల కోటా(local body mlc elections telangana 2021) నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీశ్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి.. హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి వీరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ స్థానాల నుంచి జనవరి నాలుగో తేదీలోగా కొత్త వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంది.

ఇదీ చదవండి: MLC elections Telangana congress : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? దూరంగా ఉండాలా?

Last Updated :Nov 21, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.