ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@9AM

author img

By

Published : Apr 25, 2021, 8:58 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news, telangana latest news, telangana updates
తెలంగాణ టాప్ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ న్యూస్

  • మరణ మృదంగం

రాష్ట్రంపై కరోనా రెండో దశ తీవ్రప్రభావం చూపిస్తోంది. వారం నుంచి రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొవిడ్‌తో చికిత్స పొందుతూ అత్యధికంగా 33 మంది మృతిచెందారు. పది గంటల వ్యవధిలో పలు ఆసుపత్రుల్లో వెయ్యి మంది చేరగా...దాదాపుగా ఐసీయూ పడకలన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణకు రెమ్‌డెసివిర్‌

కేంద్ర సర్కార్ తెలంగాణకు అదనంగా 13,500 రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తొలుత 21,500 కేటాయించగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 35వేలకు పెంచింది. అత్యధికంగా మహారాష్ట్రకు 4,35,000 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇవ్వనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కొవాగ్జిన్ ధర ఎంతంటే?

కొవాగ్జిన్ టీకా ధరలను భారత్​ ​బయోటెక్​ సంస్థ ప్రకటించింది. కేంద్రానికి రూ.150కు, రాష్ట్రాలకు రూ.600కు అమ్ముతామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తగ్గుతున్న రక్తనిధి

కరోనా ప్రభావం రక్తనిధి కేంద్రాలపై పడింది. కేసులు పెరుగుతుండటం, దాతలు ముందుకు రాకపోవడంతో రక్త నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లోని ప్రధాన బ్లడ్‌ బ్యాంకుల్లో మే నెలలో 4,324 యూనిట్ల రక్తం అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 796 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు హైదరాబాద్​లోని నారాయణగూడ ఐపీఎం కేంద్ర సిబ్బంది వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గతంలోనే కేంద్రానికి హెచ్చరిక!

ప్రాణవాయువు ఉత్పత్తి పెంచాలని, భారీ స్థాయిలో నిల్వ చేయాలని కేంద్రానికి నవంబర్​లోనే సూచనలు ఇచ్చింది పార్లమెంటరీ స్థాయీ సంఘం. ఆక్సిజన్ కొరత వల్ల ఏర్పడే ఇబ్బందుల గురించి గతంలోనే హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అది ఫేక్‌న్యూస్‌!

కొవిడ్ వ్యాక్సినేషన్​ తీసుకునేముందు మహిళలు.. తమ పీరియడ్స్ సమయాన్ని చెక్​ చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్​పై కేంద్రం స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేసింది. 18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తల్లి నుంచి బిడ్డకు కొవిడ్ వ్యాప్తి తక్కువే!

తల్లి నుంచి బిడ్డకు కొవిడ్​ సోకే ప్రమాదం తక్కువే ఉన్నా.. శిశువుల్లో పరోక్ష సమస్యలు తలెత్తే ఆస్కారం ఎక్కువగా ఉందని ఓ పరిశోధనలో తేలింది. అమెరికా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆగస్టు నాటికి బయోలాజికల్‌ ఇ టీకా?

హైదరాబాద్​కు చెందిన​ ఫార్మా కంపెనీ బయోలాజికల్ ఇ. లిమిటెడ్ కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మొదటి, రెండో దశ పరీక్షల్లో సానుకూల ఫలితాలు పొందిన ఈ కంపెనీ టీకా.. మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు అనుమతి పొందింది. తాము రూపొందించిన టీకా సురక్షితమే గాక.. అన్ని రకాల కరోనా వైరస్​లను సమర్థంగా తట్టుకోగలదని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దిల్లీ మ్యాచ్​లు అక్కడే!

దిల్లీలో కరోనా ఉద్ధృతి భీకర స్థాయిలో ఉన్నా.. అక్కడి నుంచి ఐపీఎల్ మ్యాచ్​లు తరలించే అవకాశం కనబడటం లేదు. బయోబబుల్​ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయని, షెడ్యూల్​ ప్రకారమే మ్యాచ్​లు జరుగుతాయని దిల్లీ క్రికెట్ సంఘం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఈసారి తెలుగు హీరోతోనే?

'గురు', 'ఆకాశమే నీ హద్దురా'.. తదితర చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధా కొంగర.. తన తర్వాతి సినిమా తెలుగు హీరోతో చేయాలని భావిస్తున్నారట. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరై ఉంటారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.