ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM

author img

By

Published : Sep 7, 2022, 7:00 AM IST

Telangana News Today
Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • నియంత్రణ రేఖ వద్ద 250 మంది ఉగ్రవాదులు

భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేసింది.

  • ఈ నెల 12, 13న శాసనసభ సమావేశాలు

Telangana Assembly Sessions 2022 : శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మరణించిన అసెంబ్లీ మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించి.. శాసనసభను వాయిదా వేశారు. అనంతరం సమావేశాల పని దినాలు, చర్చించే అంశాలపై బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12, 13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు.

  • సభాపతిపై చేసిన వ్యాఖ్యలకు ఈటల క్షమాపణలు చెప్పాలి

Minister Prashant Reddy Fires on Etela: సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈటల వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి ప్రశాంత్​ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనను అవమానిస్తే మెుత్తం శాసనసభను అవమానించినట్లేనని ఆయన పేర్కొన్నారు. బీఏసీలో సభ్యుల సంఖ్య ప్రకారం పార్టీలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభాపతిని గౌరవాన్ని కాపాడడానికి నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని అన్నారు.​

  • సెప్టెంబర్ 16న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక

Amit Shah Come To Hyderabad On 16th: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16న హైదరాబాద్‌కు రానున్నారు. సెప్టెంబర్‌ 17న పరేడ్‌ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు.

  • కాళేశ్వరం తెలంగాణ ప్రాణేశ్వరం: హరీశ్‌రావు

Harish Rao on Kaleshwaram Project: కాళేశ్వరం మునిగిపోవాలన్న కొందరి కలలు కల్లలయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ద్వారా ఈ నెలలోనే పైసా ఖర్చు పెట్టకుండా నీరిస్తామన్న ఆయన... యాసంగిలో ఒక్క గుంట కూడా ఎండిపోకుండా నీరిచ్చి చూపిస్తామని దీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కేంద్రమంత్రులు చేస్తున్న విమర్శలను మంత్రి హరీష్‌రావు కొట్టిపారేశారు.

  • దిల్లీలో వందల కిలోల డ్రగ్స్​ స్వాధీనం

Drugs Seized In Delhi : దిల్లీలో భారీ డ్రగ్స్​ రాకెట్​ను పట్టుకున్నారు పోలీసులు. సుమారు 322.5 కిలోల మాదకద్రవ్యాలను దిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.1200కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  • బ్రిటన్​ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్

Britain New Prime Minister : బ్రిటన్​ కన్జర్వేటివ్‌ పార్టీ అధ్యక్షురాలిగా లిజ్​ ట్రస్​ విజయం సాధించారు. ప్రత్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్​పై గెలుపొంది బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజాగా బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ 2.. లిజ్​ను అధిరికంగా ప్రధానమంత్రిగా నియమించారు.

  • చైనాలో భూకంప విధ్వంసం.. 65 మంది మృతి

Earthquake In China: చైనాలో సంభవించిన భారీ భూకంపం.. పెను విధ్వంసాన్ని సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి మరణించిన వారి సంఖ్య 65కి పెరిగింది. వందల మంది గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా.. భారీ వృక్షాలు నేలకొరిగాయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలను వేగవంతం చేశారు.

  • ఉత్కంఠ పోరులో ఓడిన భారత్‌

IND vs SL Asia Cup 2022 : చావోరేవో మ్యాచ్‌లో భారత్‌ చేతులెత్తేసింది. ఆసియాకప్ ఫైనల్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చవిచూసింది. సూపర్‌-4లో భాగంగా భారత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో భారత్‌ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

  • రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా సంతోషమే: నటుడు ఆర్య

తమిళ నటుడు ఆర్య.. 'వరుడు'లో విలన్​గా కనిపించినప్పటికి 'నేనే అంబానీ', 'రాజా రాణి' లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. త్వరలో 'కెప్టెన్'​ అనే కొత్త ప్రాజెక్ట్​తో ధియేటర్లలోకి రానున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి మరిన్ని ముచ్చట్లు ఆయన మాటల్లోనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.