ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 7AM

author img

By

Published : Aug 8, 2022, 6:59 AM IST

Telangana News Today
Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్​.. హెచ్​ఐసీసీలో వీటిని ప్రారంభిస్తారు. ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.

  • నేడు స్పీకర్​కు రాజీనామా లేఖ అందజేయనున్న రాజగోపాల్​రెడ్డి

Rajagopal Reddy Resigns as MLA : కాంగ్రెస్​ పార్టీకి, తన శాసనసభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. నేడు స్పీకర్​కు తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు స్పీకర్​ అపాయింట్​మెంట్​ ఉందని రాజగోపాల్​రెడ్డి వెల్లడించారు.

  • తిరుపతి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు.

  • పేరుకే ఉన్నట్టు.. అంతా కనికట్టు

హైదరాబాద్​లో ప్రీలాంచ్​ విక్రయాల పేరుతో జరుగుతున్న మోసాలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రాఫిక్స్‌ హంగులు, అద్ది రంగురంగుల బ్రోచర్లను చూసి వలలో పడిన చాలా మంది రూ.కోట్లల్లో నష్టపోతున్నారు. భూమి, అనుమతులు లేకుండా, రెరాలో రిజిస్టర్‌ కాని వెంచర్లలో కొని మోసపోవద్దని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు.

  • నిఖత్ జరీన్​కు కేసీఆర్ అభినందనలు..

kcr congratulates nikhat zareen: కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్ జరీన్ పసిడి పంచ్​కు ప్రశంసల వర్షం కురుస్తోంది. పతకం గెలవగానే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర కీర్తి మరోసారి విశ్వవాప్తం చేశావని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

  • పార్లమెంటు నిష్క్రియంగా మారింది

దేశంలో ప్రజాస్వామ్యం అతికష్టంగా ఊపిరి పీల్చుకుంటోందన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. ఆశించిన స్థాయిలో పార్లమెంటు సమావేశాలు జరగకపోవడంపై స్పందిస్తూ.. పార్లమెంటు నిష్క్రియంగా మారిందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

  • భారత జలాల్లోకి పాక్‌ యుద్ధనౌక

భారత్​ జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్​ యుద్ధనౌకను కోస్ట్​ గార్డ్​ సిబ్బంది తిప్పికొట్టారు. సముద్ర తీరంలో నిఘా కోసం అప్పటికే సమీప వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన 'డోర్నియర్' విమానం.. ఈ నౌక ఆచూకీని గుర్తించింది. దానిపై నిఘా కొనసాగిస్తూనే.. నౌక ఉనికి గురించి కమాండ్ సెంటర్‌కు సమాచారం అందించిందని అధికారులు వెల్లడించారు.

  • కామన్​వెల్త్​ గేమ్స్​లో శ్రీలంక క్రీడాకారులు మిస్సింగ్!

కామన్​వెల్త్​ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది శ్రీలంక ఆటగాళ్లు అనుమానాస్పదరీతిలో అదృశ్యమయ్యారు. బ్రిటన్​లో ఉండిపోయేందుకే వారు ఇలా చేసి ఉంటారని శ్రీలంక అధికారులు భావిస్తున్నారు. అంతకుముందు 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా కూడా ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు.

  • ఫైనల్లో టీమ్​ఇండియా ఓటమి.. సిల్వర్​ సాధించిన మహిళల జట్టు

CWG 2022 India: కామన్​వెల్త్​ గేమ్స్​లో ఆదివారం జరిగిన మహిళల క్రికెట్​ ఫైనల్​లో టీమ్​ఇండియా వెండి పతకాన్ని సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్లు తక్కువ పరుగులకే ఔటవడం సహా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవకపోవడంతో పసిడి సాధించలేకపోయింది.

  • 'కాఫీ విత్​ కరణ్​ షో'పై తాప్సీ షాకింగ్​ కామెంట్స్!

'కాఫీ విత్​ కరణ్​షో'పై షాకింగ్​ కామెంట్స్​ చేసింది హీరోయిన్​ తాప్సీ. ప్రస్తుతం అవి వైరల్​గా మారాయి. ఇంతకీ తాప్సీ ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.