ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM

author img

By

Published : May 22, 2022, 11:00 AM IST

Telangana News Today
Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. కొత్తగా 2,226 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 65 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ.9.83, డీజిల్ ధర రూ.7.67 మేర తగ్గాయి.

  • మాకు కావాల్సింది ఎన్​కౌంటర్లు కాదు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు​పై సిర్పూర్కర్​ కమిషన్​ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మహిళా, ట్రాన్స్​జెండర్లు, మహిళా హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు స్వాగతించారు. నిందితుల ఎన్​కౌంటర్​ బూటకమని తేల్చిన కమిషన్​ నివేదికను సమర్థించారు. ఈ మేరకు మహిళల భద్రత, రక్షణపై రాష్ట్ర హైకోర్టుకు ఈ సంఘాలు పలు సిఫార్సులు చేశాయి.

  • పగ, ప్రతీకారం ఒకరిది.. పావులు మరొకరు

పగ, ప్రతీకారం ఒకరివి.. వారు వేసే డబ్బు ఎరకు చిక్కి.. జీవితాలను ఛిద్రం చేసుకునే వారు వేరొకరు. తమ పేరు బయటకు రాకుండా వ్యవహారం చక్కబెట్టాలని.. ప్రధాన నిందితులు సుపారీ ఇచ్చి కిరాయి మనుషులతో హత్యలు చేయిస్తున్నారు. కొద్దిపాటి డబ్బిస్తే తెగించే సామాన్యులను వెతికి మరీ పట్టుకుంటున్నారు. వీరిచ్చే డబ్బు కుటుంబ అవసరాలకో, విలాసాలకో పనికొస్తుందన్న ఆశతో హత్యలకు పాల్పడేవారు చివరకు కటకటాలపాలవుతున్నారు.

  • మందుకొట్టి అమ్మాయిల రచ్చ

మద్యం మత్తులో ఇద్దరు యువతులు రచ్చ చేశారు. తాగి రేంజ్​ రోవర్​ కారు నడుపుతూ.. ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. అతని భార్య, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సైపైనా దాడికి యత్నించారు నిందితులు. ఈ ఘటన హరియాణా అంబాలాలో జరిగింది.

  • లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది

ఆస్ట్రేలియాలో ప్రభుత్వం మారనుంది. శనివారం జరిగిన ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. అనేక మంది ఓటర్లు అండర్​వేర్​ మాత్రమే ధరించి, పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం చర్చనీయాంశమైంది.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఏపీ, తెలంగాణలో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • గూగుల్​పే, ఫోన్​పే చేస్తున్నారా? బీ అలర్ట్!!

రూపాయి చెల్లించాలన్నా.. ఇప్పుడంతా నగదు రహితమే. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) రాకతో చెల్లింపుల తీరే పూర్తిగా మారిపోయింది. ఇదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదమూ పొంచి ఉంది.

  • పాపం రోహిత్​

శనివారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ ఓడిపోవడం వల్ల ప్లే ఆఫ్స్​ చేరిన జట్లపై స్పష్టత వచ్చేసింది. కాగా, ఈ మ్యాచ్​లో ఓ యాదృశ్చిక ఘటన చోటు చేసుకుంది. దీంతో పాటే కెప్టెన్​ రోహిత్​ శర్మ ఓ పేలవ రికార్డును, యువ ఆటగాడు తిలక్​ వర్మ ఓ సూపర్​ రికార్డును నమోదు చేశారు. అవేంటో తెలుసుకుందాం..

  • దీపిక, పూజా.. టాప్​ టు బాటమ్​ సమ్మర్​ ట్రీట్

కేన్స్​ చలన చిత్రోత్సవాల్లో దీపికాపదుకొణె, పూజాహెగ్డే సహా పలువురు భారతీయ ముద్దుగుమ్మలు రోజుకో కొత్త లుక్​, అదిరిపోయే డ్రెస్సుల్లో మెరిశారు. అవి అభిమానులను బాగా ఆకర్షించాయి. వాటిని ఓ సారి చూసేద్దాం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.