ETV Bharat / city

Telangana News Today : టాప్‌న్యూస్ @ 1PM

author img

By

Published : May 21, 2022, 1:00 PM IST

Telangana News Today
Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • నా అల్లుడిని చంపినవాళ్లను ఉరి తీయాలి

తన అల్లుడిని చంపి కుమార్తె సంసారాన్ని నాశనం చేశారని బేగంబజార్ పరువు హత్య మృతుడి భార్య తల్లి మధుబాయి ఆవేదన వ్యక్తం చేశారు. నీరజ్‌ను హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని డిమాండ్ చేశారు. నీరజ్ హత్యలో తమ కుటుంబ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

  • బేగంబజార్ పరువు హత్య కేసులో నలుగురు అరెస్టు

హైదరాబాద్‌ బేగంబజార్‌ పరువు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజన బాబాయి కుమారులు స్నేహితులతో కలిసి నీరజ్‌ను హత్య చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్య తర్వాత కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు. కర్ణాటకలోని గుర్‌మిత్కల్‌లో నిందితులను పట్టుకున్నారు.

  • అఖిలేశ్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. హస్తినలోని కేసీఆర్ ఇంట్లో సమావేశమైన ఇరువురు.. దేశంలోని తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

  • ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ముస్తాబు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ముస్తాబవుతోంది. ఈసారి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ ఆదేశించారు. మరోవైపు ఆరోజున జిల్లాల్లో పతాకాన్ని ఆవిష్కరించే మంత్రులు, ఇతర ప్రముఖుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

  • అసోం గోస: నీటమునిగిన ఇళ్లు.. రైల్వే ట్రాక్​లే నివాసాలు

ఈశాన్య రాష్ట్రం అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి.

  • కేన్స్​లో నగ్నంగా ఉక్రెయిన్​ మహిళ నిరసన

ఉక్రెయిన్​లో మహిళలపై రష్యా సైనికులు దారుణంగా వ్యవహరిస్తున్నట్లు ఓ మహిళ కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ అత్యాచారాలను ఆపాలంటూ నగ్నంగా నిరసన తెలిపింది.

  • పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర.. నేటి రేట్లు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 వృద్ధి చెందింది. మరోవైపు కిలో వెండి రూ.203 దిగింది. క్రిప్టోకరెన్సీలు కూడా లాభాలను నమోదు చేశాయి.

  • ధోనీపై గావస్కర్ వ్యాఖ్యలు​

వచ్చే ఏడాది ఐపీఎల్​ ఆడతానంటూ ధోనీ తీసుకున్న నిర్ణయం సరైందని హర్షం వ్యక్తం చేశాడు దిగ్గజ క్రికెటర్ సునీల్​ గావస్కర్​. మరోవైపు షిమ్రన్‌ హెట్‌మెయర్‌పై అతడు చేసిన వ్యాఖ్యలు క్రికెట్​ ప్రేమికులను ఆగ్రహానికి గురి చేశాయి.

మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని హీరో బాలకృష్ణ ప్రకటన చేశారు. తమ కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

  • 'భవదీయుడు భగత్‌సింగ్‌' అప్డేట్

గబ్బర్‌సింగ్‌'తో బాక్సాఫీస్‌ని ఊపేసిన కలయిక పవన్‌కల్యాణ్‌-హరీష్‌శంకర్‌లది. ఆ ఇద్దరూ కలిసి చేయబోతున్న సినిమా 'భవదీయుడు భగత్‌సింగ్‌'. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ చిత్రం కోసం, అప్డేట్స్​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై మాట్లాడారు దర్శకుడు హరీశ్​ శంకర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.