ETV Bharat / business

పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర.. నేటి రేట్లు ఇలా..

author img

By

Published : May 21, 2022, 10:47 AM IST

gold rate today
gold rate today

gold rate today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 వృద్ధి చెందింది. మరోవైపు కిలో వెండి రూ.203 దిగింది. క్రిప్టోకరెన్సీలు కూడా లాభాలను నమోదు చేశాయి.

Gold price today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.430 పెరుగుదల నమోదైంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారం రూ.63,343 గా ఉన్న కిలో వెండి ధర రూ.203 తగ్గి రూ. 63,140 చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,670 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,670గా ఉంది. కిలో వెండి ధర రూ.63,140 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,140గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,670గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,140 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,670గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,140 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,845 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.79 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: గత కొన్ని రోజులుగా నష్టాలను నమోదు చేస్తున్న క్రిప్టో కరెన్సీలు శనివారం లాభాల్లో కొనసాగుతున్నాయి. బిట్​కాయిన్​ విలువ రూ.4,871 పెరిగి రూ.22,73,727కు చేరింది. ఈ నేపథ్యంలో ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,73,727
ఇథీరియంరూ.1,52,808
టెథర్రూ.77.72
బినాన్స్​ కాయిన్రూ.23,542
యూఎస్​డీ కాయిన్రూ.82.22

ఇదీ చదవండి: పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.