ETV Bharat / city

Lands auction in telangana: సర్కార్‌ స్థలాలకు మళ్లీ వేలం

author img

By

Published : Feb 12, 2022, 3:56 AM IST

TSIIC, HMDA Lands auction: టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జిల్లాల పరిధిలోని భూముల అమ్మకానికి వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 14 నుంచి 17 వరకు 1,408 ప్లాట్లకు వేలం నిర్వహణ జరుగనుంది. TSIIC, HMDA పరిధిలోని స్థలాల సమాచారం, బ్రోచర్లు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో, జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వివరాలు సంబంధిత జిల్లాల అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయని వెల్లడించింది.

Lands auction in telangana
Lands auction in telangana

TSIIC, HMDA Lands auction in telangana: రాష్ట్రంలోని సర్కారు స్థలాల అమ్మకాలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఆదాయార్జన కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC), హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA), జిల్లాల పరిధిలోని 1,408 ఖాళీ స్థలాల(ప్లాట్ల)కు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మార్చి 14, 15, 16, 17 తేదీల్లో జిల్లాల వారీగా వీటి వేలం(భౌతికంగా) జరుగుతుంది. పట్టణాల్లోని ముఖ్యప్రాంతాల మధ్యలో ఉన్న ఈ స్థలాలు వివాదరహితమైనవని, వాటిలో సత్వరమే నిర్మాణాలు చేపట్టవచ్చని పేర్కొంది. సమగ్ర మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ స్థలాల వద్ద వచ్చే డిసెంబరు వరకు అంతర్గత రహదారులు, వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని, భూ వినియోగానికి ఎలాంటి మార్పులు అవసరం లేదని తెలిపింది. టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని స్థలాల సమాచారం, బ్రోచర్లు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో, జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వివరాలు సంబంధిత జిల్లాల అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయని వెల్లడించింది.

వేలం ప్రక్రియ ఇలా..

మొదటి సారి దరఖాస్తు చేసుకునేవారు రూ.10 వేల ధరావత్తు చెల్లించాలి. ఈ భూములకు సంబంధించిన ప్రిబిడ్‌ సమావేశాలు ఈ నెల 18న, మార్చి 7న జరుగుతాయి. ఈ సందర్భంగా జిల్లాల వారీగా వేలం వేదికల వివరాలు ప్రకటించి ఆయా జిల్లాల వెబ్‌సైట్లలో పొందుపరుస్తారు. కొనుగోళ్లకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు స్థలాలను సందర్శించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

Lands auction in telangana
Lands auction in telangana

ఇదీ చూడండి: నేడు యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. రాయగిరిలో భారీ బహిరంగ సభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.