ETV Bharat / city

sri lankan crisis : శ్రీలంకకు తెలుగు రాష్ట్రాల బియ్యం

author img

By

Published : Apr 6, 2022, 7:31 AM IST

sri lankan crisis : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రజలు నిత్యావసరాల కోసం అల్లాడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన భారత్ అవసరమైన మేరకు సాయమందిస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలు శ్రీలంక ప్రజలకు బియ్యం పంపించనున్నాయి.

sri lankan crisis
sri lankan crisis

sri lankan crisis : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న శ్రీలంకను ఆదుకొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం వెళ్లనున్నాయి. శ్రీలంక అభ్యర్థన మేరకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్‌.. తక్షణం బియ్యం పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా జరిగింది.

sri lankan crisis News : ఇందులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, ట్యుటికోరిన్‌ తదితర పోర్టుల నుంచి బియ్యం శ్రీలంకకు ఎగుమతి చేయనున్నారు. మొదటగా కాకినాడ పోర్టు నుంచి బుధవారం రెండు వేల మెట్రిక్‌ టన్నులతో కార్గో బయలుదేరనుంది. తర్వాత చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి పంపించనున్నారు. తెలంగాణలో కొనుగోలు చేసే బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా తరలించనున్నారు. మొత్తం మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని దశలవారీగా శ్రీలంకకు పంపుతామని భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి.కృష్ణారావు తెలిపారు.

మంత్రుల రాజీనామా : తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో 26 మంది కేబినెట్ మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం శ్రీలంక ప్రధానికి రాజీనామా పత్రాలు అందజేశారు. రాజీనామాల నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వారు పేర్కొన్నారు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానిగా కొనసాగనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎమర్జెన్సీ ఎత్తివేత : ఇటీవల పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్‌ కోతలతో ప్రజలు గత కొన్నిరోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో తీవ్ర హింస చెలరేగింది. పలువురు గాయపడ్డారు. దీంతో అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించారు. ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మంగళవారం రాత్రి ప్రకటించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.