ETV Bharat / city

Telangana Weather Updates : రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

author img

By

Published : Jan 22, 2022, 7:03 AM IST

Telangana Weather Updates
Telangana Weather Updates

రాష్ట్రాన్ని మరోసారి వరణుడు పలకరించే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతారవణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపపు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో ఆదివారం రోజున మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆదివారం(ఈ నెల 23) రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

శనివారం పొడి వాతావరణముంటుందందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల చలి తీవ్రత పెరుగుతోందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున అత్యల్పంగా తానూరు(నిర్మల్‌ జిల్లా)లో 10.9 డిగ్రీలుంది. ఉదయం పూట పలు చోట్ల పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 16 శాతం అదనంగా పెరిగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.