ETV Bharat / city

ప్రగతిభవన్​లో ముగిసిన కేసీఆర్, జగన్​ భేటీ

author img

By

Published : Aug 1, 2019, 5:50 PM IST

Updated : Aug 1, 2019, 6:00 PM IST

హైదరాబాద్​ ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్​రెడ్డి సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో గోదావరి జలాల మళ్లింపు, విభజన అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ప్రగతిభవన్​లో ముగిసిన కేసీఆర్, జగన్​ల భేటీ

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్​రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్​ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటలపైగా జరిగిన సమావేశంలో విభజన సమస్యలు, తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చించారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో ఇరువురి ముఖ్యమంత్రుల మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్​ను కలిసేముందు రాజ్​భవన్​లో గవర్నర్​ నరసింహన్​ను జగన్​ మర్యాదపూర్వకంగా కలిశారు.

Last Updated : Aug 1, 2019, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.